కొవిడ్-19: కంటతడి పెట్టిస్తున్న మహిళా పోలీస్ వీడియో

ABN , First Publish Date - 2020-04-30T21:13:19+05:30 IST

కరోనా మహమ్మారిపై పోరాడుతున్న అత్యవసర సేవల సిబ్బంది ఎదుర్కొంటున్న కష్టాలకు ప్రత్యక్ష నిదర్శనంగా...

కొవిడ్-19: కంటతడి పెట్టిస్తున్న మహిళా పోలీస్ వీడియో

డెహ్రాడూన్: కరోనా మహమ్మారిపై పోరాడుతున్న అత్యవసర సేవల సిబ్బంది కష్టాలకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచిన ఓ వీడియో ఇప్పుడు నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది. లాక్‌డౌన్ విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ తన ఇంటివద్ద ఎలాంటి సంఘర్షణ ఎదుర్కొంటున్నారో చూపిస్తూ ఉత్తరాఖండ్ పోలీసులు ట్విటర్లో దీన్ని విడుదల చేశారు. వీడియోలో కనిపిస్తున్న కానిస్టేబుల్ పేరు వినీత్ మహర్. పితోరాగఢ్‌లోని జాజర్దేవల్ పోలీస్‌స్టేషన్‌లో ఆమె పనిచేస్తున్నారు. లాక్‌డౌన్ విధులు ముగించుకుని ఇంటికెళ్లిన ఆమె... ఏడుస్తూ నిలబడిన తన కుమారుడిని సైతం దగ్గరికి తీసుకునేందుకు ధైర్యం చేయలేదు. బయటినుంచి రావడం వల్ల తన ద్వారా కుమారుడికి కరోనా సోకే ప్రమాదం ఉందని ఆమె భయపడ్డారు. ఆమె కళ్లలో నీళ్లు తిరిగినా నిస్సహాయంగా చూస్తుండిపోయారు తప్ప పిల్లాడిని తాకలేదు. విడిగా ఓ గదిలో భోజనం చేసి అట్నుంచి అటే మళ్లీ విధులకు వెళ్లిపోయారు. దీంతో ఆమె కుమారుడికి ఏమీ అర్థం కాక గేటువద్ద దీనంగా నిలబడడం వీడియోలో కనిపిస్తోంది. 



Updated Date - 2020-04-30T21:13:19+05:30 IST