ఏజీఆర్ బాకీల చెల్లింపుకు టెలికాం సంస్థలకు పదేళ్ళ గడువు : సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2020-09-01T18:43:07+05:30 IST

టెలికాం సంస్థలకు సుప్రీంకోర్టులో మంగళవారం ఊరట లభించింది. అడ్జస్టెడ్ గ్రాస్ రెవిన్యూ (ఏజీఆర్)

ఏజీఆర్ బాకీల చెల్లింపుకు టెలికాం సంస్థలకు పదేళ్ళ గడువు : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : టెలికాం సంస్థలకు సుప్రీంకోర్టులో మంగళవారం ఊరట లభించింది. అడ్జస్టెడ్ గ్రాస్ రెవిన్యూ (ఏజీఆర్) బాకీల చెల్లింపుకు పదేళ్ల గడువు ఇచ్చింది. దీంతో వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్‌టెల్, టాటా టెలీసర్వీసెస్ వంటి టెలికాం సంస్థలకు ప్రయోజనం కలుగుతుంది. ఏజీఆర్ సంబంధిత బాకీలలో 10 శాతం సొమ్మును 2021 మార్చి 31నాటికి చెల్లించాలని చెప్పింది. 


సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏజీఆర్ బాకీలను చెల్లిస్తామని టెలికాం సంస్థల ఎమ్‌డీలు లేదా సీఈఓలు లిఖితపూర్వకంగా తెలియజేయాలని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. 


డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీఓటీ) డిమాండ్, ఏజీఆర్ సంబంధిత బాకీలపై దాని తీర్పు అంతిమమైనవని స్పష్టం చేసింది. ఏజీఆర్ సంబంధిత బాకీలను చెల్లించడంలో విఫలమైతే కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లేనని, జరిమానా, వడ్డీ కూడా విధిస్తామని తెలిపింది. 


అడ్జస్టెడ్ గ్రాస్ రెవిన్యూ అంటే టెలికామ్ ఆపరేటర్ల నుంచి డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వసూలు చేసే యూసేజ్, లైసెన్సింగ్ ఫీజు. 


Updated Date - 2020-09-01T18:43:07+05:30 IST