టెలికాం కంపెనీలకు సుప్రీంకోర్టులో ఊరట

ABN , First Publish Date - 2020-09-01T18:47:05+05:30 IST

ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలపై టెలికాం కంపెనీలకు మంగళవారం సుప్రీం కోర్టులో ఊరట లభించింది.

టెలికాం కంపెనీలకు సుప్రీంకోర్టులో ఊరట

న్యూఢిల్లీ: ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలపై టెలికాం కంపెనీలకు మంగళవారం సుప్రీం కోర్టులో ఊరట లభించింది. కంపెనీలపై ఉన్న కోర్టు ధిక్కరణ కేసు తొలగించింది. మొత్తం బకాయిలు పదేళ్లలో చెల్లించాలని.. పది శాతం వెంటనే చెల్లించాలని టెలికాం కంపెనీలకు న్యాయస్థానం ఆదేశిస్తూ.. అన్ని కంపెనీలు నాలుగు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలంది. ప్రస్తుత బ్యాంకు గ్యారంటీలు యథాతధంగా కొనసాగుతాయంది. వడ్డీ చెల్లింపుల వివరాలు ప్రతి సంవత్సరం అందించాలని, 2031 నాటికి బకాయిలన్నీ చెల్లించాలని సుప్రీంకోర్టు టెలికాం కంపెనీలకు ఆదేశిస్తూ.. ఈ మేరకు తీర్పు ఇచ్చింది.  

Updated Date - 2020-09-01T18:47:05+05:30 IST