మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంతిమ యాత్ర ప్రారంభం

ABN , First Publish Date - 2020-09-01T19:02:42+05:30 IST

అనారోగ్యం కారణంగా తుది శ్వాస విడిచిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంతిమ యాత్ర ప్రారంభమైంది. కోవిడ్ నిబంధనలతో...

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంతిమ యాత్ర ప్రారంభం

న్యూఢిల్లీ: అనారోగ్యం కారణంగా తుది శ్వాస విడిచిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంతిమ యాత్ర ప్రారంభమైంది. కోవిడ్ నిబంధనలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. లోధిరోడ్డులోని శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. గన్‌ క్యారేజ్‌పై కాకుండా ప్రత్యేక అంబులెన్స్‌లో శ్మశానవాటికకు ప్రణబ్ పార్థవదేహాన్ని తరలిస్తున్నారు. సైనిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రణబ్‌కు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు నివాళులర్పించారు.


మెదడు సంబంధిత సమస్యతో బాధపడుతున్న ప్రణబ్‌కు.. కరోనా వైరస్‌ కూడా సోకడంతో ఢిల్లీలోని ఆర్మీ రిసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ ఆస్పత్రిలో చికిత్సనందించారు. కరోనా కారణంగా ఆయన ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. తర్వాత ఆయన మూత్రపిండాల పనితీరు మందగించింది. క్రమంగా రక్తం విషపూరితమై (సెప్సిస్‌), ఆదివారం నాడు సెప్టిక్‌ షాక్‌తో బాధపడ్డారని.. సోమవారం (ఆగస్టు 31న) కార్డియాక్‌ అరెస్టుతో మరణించారని వైద్యులు తెలిపారు.

Updated Date - 2020-09-01T19:02:42+05:30 IST