పామును పట్టే టెక్నిక్ ఇదే..!

ABN , First Publish Date - 2020-08-31T00:23:04+05:30 IST

పాము పేరు వింటేనే చాలా మందికి ఒళ్లు జలదరిస్తుంది. అలాంటి వాళ్లు పాము కళ్లెదుటే కాదు.. కలలో కనిపించినా ..

పామును పట్టే టెక్నిక్ ఇదే..!

పాము పేరు వింటేనే చాలా మందికి ఒళ్లు జలదరిస్తుంది. అలాంటి వాళ్లు పాము కళ్లెదుటే కాదు.. కలలో కనిపించినా భయంతో వణికిపోతారు. చివరకు పాము బుస కొట్టినా, శబ్ధం వినిపించినా భయంతో బిగదీసుకుపోతారు. పాములంటే మనుషుల్లో వ్యాపించిన భయం ఈ నాటిది కాదు. ఈ భయానికి మూలాలు ఆదిమకాలం నుంచే ఉన్నాయి. చిన్న పాము కనిపిస్తేనే ఎవరికైనా వెన్నులో వణుకుపుట్టాల్సిందే. మన దగ్గర మరీ భయం ఎక్కువ. పాములు పగ పడతాయని, వాటికి హాని చేస్తే ఎప్పటికీ వదలవన్న నమ్మకాలతో భయంతో చాలా మంది దూరం, దూరంగానే ఉంటారు. అలాంటిది ఏకంగా ఒక రిసార్ట్‌లో అవి పడగ విప్పితే ఎలా ఉంటుంది?. పరిస్థితి ఏమవుతుంది?. పామును భయపడకుండా ఎలా పట్టుకోవాలి?. అది ఎలాగో మీరే చూడండి. 

Updated Date - 2020-08-31T00:23:04+05:30 IST