కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే 15 రోజుల బిడ్డను చెత్త కుప్పలో పడేశానన్న 22 ఏళ్ల యువతి.. ఆమె కథంతా విని..

ABN , First Publish Date - 2022-05-20T19:13:45+05:30 IST

ఆ యువతి తన సంతోషం కోసం కన్న బిడ్డను వదిలించుకుంది.. 15 రోజుల బిడ్డను చెత్త కుప్పలో పడేసి తన దారి తను చూసుకుంది..

కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే 15 రోజుల బిడ్డను చెత్త కుప్పలో పడేశానన్న 22 ఏళ్ల యువతి.. ఆమె కథంతా విని..

ఆ యువతి తన సంతోషం కోసం కన్న బిడ్డను వదిలించుకుంది.. 15 రోజుల బిడ్డను చెత్త కుప్పలో పడేసి తన దారి తను చూసుకుంది.. చెత్త కుప్పలో ఏడుస్తూ ఉన్న పసికందును మున్సిపాలిటీ సిబ్బంది రక్షించి హాస్పిటల్‌లో జాయిన్ చేశారు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ బిడ్డ తల్లిని, మేనమామను గుర్తించి అరెస్ట్ చేశారు.. తనకు నచ్చిన వ్యక్తితో కొత్త జీవితం ప్రారంభించాలనే కారణంతోనే బిడ్డను వదలించుకున్నానని తల్లి చెప్పిన మాటలు విని పోలీసులు కూడా షాకయ్యారు. 

ఇది కూడా చదవండి..

కల చెదిరింది.. కథ మారింది.. వధువును హెలికాఫ్టర్‌లో తీసుకొచ్చేందుకు లక్షలు ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేసుకుంటే..



మహారాష్ట్రంలోని థానే జిల్లా ఖండావలి ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువతిని ఆమె తల్లిదండ్రులు బీహార్‌కు చెందిన ఓ 45 ఏళ్ల వ్యక్తికిచ్చి పెళ్లి చేశారు. తన కంటే రెట్టింపు వయసున్న భర్తతో కాపురం చేయడం ఆ యువతికి ఇష్టం లేకపోయింది. దాంతో ఆరు నెలల తర్వాత సోదరుడి సహాయంతో అత్తింటి నుంచి తప్పించుకుని పారిపోయింది. అయితే అప్పటికే ఆమె నాలుగు నెలల గర్భవతి. ఓ గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఏప్రిల్ 17న ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ బిడ్డ తనతో పాటు ఉంటే మరో పెళ్లి చేసుకోవడం కుదరదని ఆ యువతి భావించింది. అందుకే ఈ నెల 6వ తేదీన సోదరుడితో కలిసి థానే నుంచి ముంబై వెళ్లి ఓ చెత్త కుప్ప దగ్గర బిడ్డను వదిలేసి వెళ్లిపోయింది. 


అరగంట తర్వాత ఆ చెత్త కుప్ప దగ్గరకు వెళ్లిన మున్సిపాలిటీ సిబ్బంది ఆ బిడ్డను గుర్తించి హాస్పిటల్‌లో చేర్చారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ బిడ్డను అక్కడ వదిలేసిన మహిళను గుర్తించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ అంతటినీ గంటల పాటు గమనించి ఆ యువతి రైలు ఎక్కి ఖండావలిలో దిగినట్టు గుర్తించారు. ఖండావలి వెళ్లి ఆ యువతిని, ఆమె సోదరుడిని అరెస్ట్ చేశారు. కేసు విచారించిన న్యాయమూర్తి చెరో పది వేల రూపాయలు పూచీకత్తు మీద ఇద్దరికీ బెయిల్ మంజూరు చేశారు. పసిబిడ్డను ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. 

Updated Date - 2022-05-20T19:13:45+05:30 IST