స్వీట్‌కార్న్‌ సలాడ్‌

ABN , First Publish Date - 2019-04-04T17:24:38+05:30 IST

వేసవి తాపాన్ని తగ్గించేందుకు స్వీట్‌కార్న్‌ సలాడ్‌ ఉపయోగపడుతుంది. జ్యూసీగా, తీపిగా, క్రంచీగా..

స్వీట్‌కార్న్‌ సలాడ్‌

వేసవి తాపాన్ని తగ్గించేందుకు స్వీట్‌కార్న్‌ సలాడ్‌ ఉపయోగపడుతుంది. జ్యూసీగా, తీపిగా, క్రంచీగా ఉండే ఈ సలాడ్‌ నోరూరిస్తుంది. దీన్ని సమ్మర్‌ స్నాక్‌గా పిల్లలకు అందించవచ్చు కూడా.
 
కావలసినవి: స్వీట్‌ కార్న్‌ గింజలు- ఒకటిన్నర కప్పు, ఉల్లిపాయ, టొమాటో (కొంచెం పెద్దది), కొత్తిమీర, నిమ్మకాయ, దానిమ్మ గింజలు- పావుకప్పు, వెన్న- రెండు టీ స్పూన్లు, చాట్‌మసాల, ఉప్పు (రుచికి సరిపడా).
 
తయారీ: వేడినీళ్లలో స్వీట్‌కార్న్‌ ఉడికించాలి. పాన్‌ మీద వెన్న రాసి, స్వీట్‌కార్న్‌ గింజల్ని వేసి, ఒకటి లేదా రెండు నిమిషాలు వేగించాలి. బౌల్‌లో వేగించిన స్వీట్‌కార్న్‌ గింజల్ని తీసుకొని, దానిమ్మ గింజలు, ఉల్లిపాయ, టొమాటో ముక్కల్ని కలపాలి. నిమ్మరసం, తరిగిన కొత్తిమీర, కొద్దిగా చాట్‌మసాల, ఉప్పు చల్లుకుంటే భలే రుచిగా ఉంటుంది.

Updated Date - 2019-04-04T17:24:38+05:30 IST