తంగ్డీ కబాబ్‌

ABN , First Publish Date - 2019-12-28T17:47:38+05:30 IST

చికెన్‌ డ్రమ్‌స్టిక్స్‌ - అరకిలో, పెరుగు - ఒక కప్పు, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, కారం - ఒక టీస్పూన్‌, గరంమసాలా - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి -

తంగ్డీ కబాబ్‌

కావలసిన పదార్థాలు: చికెన్‌ డ్రమ్‌స్టిక్స్‌ - అరకిలో, పెరుగు - ఒక కప్పు, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, కారం - ఒక టీస్పూన్‌, గరంమసాలా - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, పచ్చిమిర్చి - నాలుగు, కొత్తిమీర - ఒక కట్ట, నిమ్మకాయ - ఒకటి, ఉల్లిపాయలు - రెండు.
 
తయారీ విధానం: ఒక పాత్రలో చికెన్‌ డ్రమ్‌స్టిక్స్‌ తీసుకుని పెరుగు, అల్లంవెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, గరంమసాలా, ధనియాల పొడి, తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర తురుము వేసి బాగా కలియబెట్టి నాలుగైదు గంటల పాటు పక్కన పెట్టాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక చికెన్‌ డ్రమ్‌స్టిక్స్‌ను నెమ్మదిగా పేర్చినట్టుగా వేసి మూత పెట్టి పెద్ద మంటపై ఐదు నిమిషాలు ఉడికించాలి. తరువాత మూత తీసి డ్రమ్‌స్టిక్స్‌ను తిప్పి మరో మూడు నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా నిమ్మరసం పిండుకుని, ఉల్లిపాయలతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-12-28T17:47:38+05:30 IST