కొరమీను కూర

ABN , First Publish Date - 2019-06-08T16:06:35+05:30 IST

చేపలు - అరకిలో, ధనియాల పొడి - రెండు టీస్పూన్లు, అల్లం(దంచినది) - టీస్పూన్‌, ఉల్లిపాయ - ఒకటి, ఉప్పు - రుచికి తగినంత, పసుపు - అర టీస్పూన్‌, కారం...

కొరమీను కూర

కావలసినవి
 
చేపలు - అరకిలో, ధనియాల పొడి - రెండు టీస్పూన్లు, అల్లం(దంచినది) - టీస్పూన్‌, ఉల్లిపాయ - ఒకటి, ఉప్పు - రుచికి తగినంత, పసుపు - అర టీస్పూన్‌, కారం - రెండు టీస్పూన్లు, అల్లంవెల్లుల్లి పేస్టు - రెండు టీస్పూన్లు, జీలకర్ర పొడి - అర టీస్పూన్‌, మెంతిపొడి - పావు టీస్పూన్‌, చింతపండు - యాభె గ్రాములు, నూనె - రెండు టేబుల్‌స్పూన్లు, కరివేపాకు - కొద్దిగా, కొత్తిమీర - కట్ట, మెంతికూర - కట్ట.
 
తయారీవిధానం
 
ముందుగా చేపలను ముక్కలుగా కట్‌ చేసుకొని, ఉప్పు వేసి బాగా శుభ్రం చేసుకోవాలి. జీలకర్ర, మెంతులను ముందుగా వేగించుకొని, మిక్సీలో పొడి చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న చేప ముక్కలను ఒక పాత్రలో తీసుకొని అందులో చింతపండు రసం, కారం, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్టు, జీలకర్ర, మెంతి పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొకపాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక తరిగిన ఉల్లిపాయలు, అల్లం వేసి వేగించాలి. తరువాత ధనియాల పొడి వేసి చేపల ముక్కలను వేయాలి. కరివేపాకు, ఉప్పు వేసి కలపాలి. నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. నూనె పైకి తేలే వరకే ఉడికించాలి. మెంతి ఆకులు, కొత్తిమీర వేసి మరికాసేపు ఉడికించి దింపుకొని వేడి వేడిగా సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-06-08T16:06:35+05:30 IST