చుక్కకూర పరోటా

ABN , First Publish Date - 2019-09-21T17:26:27+05:30 IST

చుక్కకూర - నాలుగు కట్టలు, ఉప్పు - రుచికి తగినంత, కారం - సరిపడా, జీలకర్ర పొడి - అర టీస్పూన్‌, ధనియాల పొడి - అర టీస్పూన్‌, గోధుమపిండి - ఒక కప్పు, నూనె

చుక్కకూర పరోటా

కావలసినవి
 
చుక్కకూర - నాలుగు కట్టలు, ఉప్పు - రుచికి తగినంత, కారం - సరిపడా, జీలకర్ర పొడి - అర టీస్పూన్‌, ధనియాల పొడి - అర టీస్పూన్‌, గోధుమపిండి - ఒక కప్పు, నూనె - రెండు స్పూన్లు.
 
తయారీవిధానం
 
ముందుగా చుక్కకూరను శుభ్రంగా కడిగి కట్‌ చేయాలి. ఒక పాన్‌ తీసుకొని ఒక స్పూన్‌ నూనె వేసి కాస్త వేడి అయ్యాక జీలకర్ర పొడి, ధనియాల పొడి వేగించాలి. తరువాత చుక్కకూర వేసి మరికాసేపు వేగించాలి. రెండు నిమిషాల పాటు వేగాక దింపుకోవాలి. ఇప్పుడు గోధుమపిండి, కారం, ఉప్పు వేసి మెత్తటి మిశ్రమం అయ్యేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పరోటాలుగా ఒత్తుకోవాలి. పరోటాలకు నూనె రాస్తూ పెనంపై రెండు వైపులా కాల్చాలి. చట్నీతో తింటే ఈ పరోటాలు రుచిగా ఉంటాయి.

Updated Date - 2019-09-21T17:26:27+05:30 IST