కష్టాల్లో ఉన్న ప్రజలపై మళ్లీ జే ట్యాక్స్ వేశారు: బోండా ఉమ

ABN , First Publish Date - 2020-07-21T21:45:23+05:30 IST

ప్రజలు కరోనాతో ఉపాధి కోల్పోయిన పుట్టెడు కష్టాల్లో ఉంటే కరెంట్ ఛార్జీలు 10 రెట్లు పెంచడం తుగ్లక్ పాలనకు నిదర్శనం కాదా అని ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత బోండా ఉమా

కష్టాల్లో ఉన్న ప్రజలపై మళ్లీ జే ట్యాక్స్ వేశారు: బోండా ఉమ

అమరావతి: ప్రజలు కరోనాతో ఉపాధి కోల్పోయి పుట్టెడు కష్టాల్లో ఉంటే కరెంట్ ఛార్జీలు 10 రెట్లు పెంచడం తుగ్లక్ పాలనకు నిదర్శనం కాదా అని ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వరరావు తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. డీజిల్, పెట్రోల్‌పై ఇప్పుడు మళ్లీ జే ట్యాక్స్ వేశారని దుయ్యబట్టారు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనా కట్టడిలో సీఎం జగన్ చేతులు ఎత్తేశారని విమర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు లేక ప్రజలు నరకం చూస్తున్నారని అన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో అయితే ప్రజలను కనీసం లోనికి కూడా రానీయటం లేదన్నారు. జగన్ ప్రభుత్వం పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రి ఎవరో ఆ శాఖ అధికారులకే తెలియదని అన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి జగన్ కేవలం సమీక్షలకే పరిమితం అవుతున్నారని నిప్పులు చెరిగారు.

Updated Date - 2020-07-21T21:45:23+05:30 IST