కులంతో జగన్ గోలీలాట!

ABN , First Publish Date - 2020-11-03T00:16:43+05:30 IST

కులాల వారీగా ఓట్లు లెక్కేసుకున్నారు. ఒక కులంపై విద్వేష ప్రచారాన్ని విషంలా ఎక్కించారు. మిగిలిన కులాల ఈక్వేషన్‌ను మార్చేశారు. సోషల్ మీడియాలో సోషల్ ఇంజినీరింగ్..

కులంతో జగన్ గోలీలాట!

కులాల వారీగా ఓట్లు లెక్కేసుకున్నారు. ఒక కులంపై విద్వేష ప్రచారాన్ని విషంలా ఎక్కించారు. మిగిలిన కులాల ఈక్వేషన్‌ను మార్చేశారు. సోషల్ మీడియాలో సోషల్ ఇంజినీరింగ్ చేశారు. రాజకీయాలకు కులం రంగు ఎప్పుడో పూసినా ఇప్పుడు ఏకంగా గోలీ ఆడేసుకున్నారు. కుల విద్వేష మెట్లతో నిచ్చెన వేసుకుని అధికార పీఠమెక్కిన వైసీపీ.. ఇక ఆ జోలికి వెళ్లదేమో అనుకున్నారు. కానీ వరుస ఫెయిల్యూర్స్ కలవరపెడుతూ ఉంటే మళ్లీ  కులం గుర్తుకొచ్చింది. అదే కార్డు తీసి షో చూపిద్దామనే ప్రయత్నం మొదలుపెట్టారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి కుల ప్రస్తావన చేసి వ్యూహం మారలేదని చెప్పకనే చెప్పారు. 



కులం.. ఏపీ రాజకీయాన్ని రిమోట్‌తో ఆడేసుకునే ఆయుధం. కులం లెక్కలు వేయకుండా అభ్యర్థి ఫైనల్ అవడు. కులమేంటో తెలియకుండా ఎవరికీ ఏ మేలుగాని, ఏ కీడుగాని జరగదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నరనరాల్లో జీర్ణించుకుపోయిన కులానికి వైసీపీ కొత్త కలర్ ఇచ్చింది. ఎన్నికల ముందు ప్రచారంలో దాన్నే ప్రధాన అస్త్రంగా చేసుకుని ఆ వ్యూహంలో సక్సెస్ కూడా అయింది. అధికారంలోకి వచ్చినా ఆ ఆయుధాన్ని ఇంకా అలుపులేకుండా వాడేస్తోంది. 


రాష్ట్ర అవతరణ రోజు స్వయంగా ముఖ్యమంత్రే కులం ప్రస్తావన తెచ్చారు. ఎన్నికల ముందు పోలీసు అధికారుల ప్రమోషన్‌లో కులం కార్డును మొదటిగా జగన్ వాడారు. ఒక పెద్ద లిస్టు తయారు చేసి ఒకే కులానికి ఎన్నో ప్రమోషన్లు ఇచ్చినట్లు ఆరోపణలు చేసి దాన్ని ఒక సీడీలో వేసి ఢిల్లీ లెవల్‌లో ప్రచారం చేశారు. దాని మీద పెద్ద చర్చ జరిగేలా చూసుకున్నారు. నిజనిజాలతో వారికి పని లేదు. చర్చలేపితే చాలు..నిజం తెలుసుకునే‌లోపు వారనుకున్న పని పూర్తి అయిపోతుంది. అలాగే జరిగింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో అదే ప్రచారం. చంద్రబాబు నాయుడు అందరికీ పథకాలు అందించి గెలవాలని చూశారు గానీ ఒక కులానికే ప్రయోజనం అందించాలనే ఆలోచన మాత్రం చేయలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కానీ కొందరు మాత్రం కులం పేరుతో చేసిన ప్రయత్నం ఆ పార్టీ మొత్తానికి అంటగట్టేసి వైసీపీ తెలివిగా విద్వేష ప్రచారం చేసింది. ఆ ప్రచారం పని చేసింది. రాజధాని అమరావతిపైనా అదే కులాన్ని వాడారు. కేవలం ఒక కులం ప్రయోజనాల కోసమే అమరావతి అని, వారే ఉద్యమం చేస్తున్నారని ప్రచారం చేశారు. దీంతో ఉద్యమకారుల్లోనూ, పొలాలిచ్చిన రైతుల్లోనూ ఏయే కులం నుంచి ఎంత మంది ఉన్నారనే లెక్కలు తీసి మరీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ లోపే ఆ ప్రచారం స్పీడుగా వెళ్లిపోయింది. వైసీపీ వెనుక ర్యాలీ అయిన వారంతా నమ్మేలా ఆ ప్రచారం చేశారు.

Updated Date - 2020-11-03T00:16:43+05:30 IST