తీర ప్రాంత మత్స్యకారుల మధ్య కుదరని సయోధ్య
ABN , First Publish Date - 2020-12-18T14:49:22+05:30 IST
చీరాల తీర ప్రాంత గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అడిషనల్ ఎస్పీ రవిచంద్ర ఆధ్వర్యంలో పోలీసుల బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ప్రకాశం : చీరాల తీర ప్రాంత గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అడిషనల్ ఎస్పీ రవిచంద్ర ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మత్స్యకారుల మధ్య సయోధ్య కుదుర్చాలని ప్రయత్నించిన ఫలించలేదు. అర్ధరాత్రి వరకు చీరాల వన్ టౌన్ స్టేషన్‌లో తీర ప్రాంత పరిస్థితిపై పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సమీక్షించారు. ఈరోజు, రేపు వాడరేవు, కటారివారిపాలెం గ్రామాల్లో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ సందర్శించే అవకాశాలున్నాయి. నిన్న వాడరేవు గ్రామానికి చెందిన 11 మంది మత్స్యకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. కఠారివారిపాలెం, రామాపురం మత్స్యకారుల పడవలపై దాడి చేసిన ఘటనలో ఇప్పటి వరకు 15 మంది వాడరేవు మత్స్యకారులను.. వాడరేవు గ్రామంపై దాడి చేసిన ఘటనలో ఇప్పటికే 16 మంది కఠారివారిపాలెం మత్స్యకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.