ప్రభుత్వం వందేళ్ల తర్వాత రీసర్వే చేయిస్తోంది: లక్ష్మీనారాయణ
ABN , First Publish Date - 2020-12-15T17:09:36+05:30 IST
గుంటూరు: ప్రభుత్వం వందేళ్ల తర్వాత రీసర్వే చేయిస్తోందని సర్వే ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు.
గుంటూరు: ప్రభుత్వం వందేళ్ల తర్వాత రీసర్వే చేయిస్తోందని సర్వే ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు. నేడు ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. వందేళ్ల రికార్డులకు ఇప్పటి వాస్తవ పరిస్థితికి తేడాలున్నాయన్నారు. దీంతో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రీసర్వే ప్రాజెక్టును సీఎం చేపట్టారన్నారు. నూతన సర్వే ఉద్యోగులను ప్రభుత్వం నియమించిందని... రీసర్వే తర్వాత ప్రజల భూవివాదాలు తొలగిపోతాయన్నారు. ఆధునిక సాంకేతికతో రీసర్వే జరుగుతోందన్నారు.
ప్రజలు సహకరించాలన్నారు.
నూతన పోస్టులిచ్చిన ప్రభుత్వానికి లక్ష్మీ నారాయణ ధన్యవాదాలు తెలిపారు.