రాంగోపాల్ వర్మపై రాజోల్ పీఎస్ కేసు నమోదు

ABN , First Publish Date - 2020-07-29T02:07:44+05:30 IST

సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై నాయి బ్రహ్మణ సంఘం నాయకులు రాజోలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాంగోపాల్ వర్మ నాయి బ్రాహ్మణులను కించపరిచే

రాంగోపాల్ వర్మపై రాజోల్ పీఎస్ కేసు నమోదు

రాజమండ్రి: సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై నాయి బ్రహ్మణ సంఘం నాయకులు రాజోలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాంగోపాల్ వర్మ నాయి బ్రాహ్మణులను కించపరిచే విధంగా మాట్లాడారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు రాజోలు పోలీసులు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు. నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు రాంగోపాల్ వర్మలపై ఫిర్యాదు చేసిన రాజోలు మండల నాయి బ్రాహ్మణ సంఘం నేతలు.. ఆయన్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2020-07-29T02:07:44+05:30 IST