ఎక్స్‌ట్రాలు చేయొద్దు.. వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి ఫోన్ సంభాషణ లీక్

ABN , First Publish Date - 2020-09-19T03:08:31+05:30 IST

తాడికొండ వైసీపీ మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ పోలీస్ అధికారిని నోటికొచ్చినట్లు ఆమె దుర్భాషలాడారు

ఎక్స్‌ట్రాలు చేయొద్దు.. వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి ఫోన్ సంభాషణ లీక్

అమరావతి: తాడికొండ వైసీపీ మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ పోలీస్ అధికారిని నోటికొచ్చినట్లు ఆమె దుర్భాషలాడారు. ‘సీఐను పట్టుకుని.. ఏరా’ అంటూ సంభోదించారు. ఎమ్మెల్యే మాట్లాడిన సంభాషణ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 


ఎమ్మెల్యే ఫోన్ సంభాషణ...

‘హలో.. ఎప్పటి నుంచి చెప్తున్నా?, వాళ్లను పంపేయొచ్చుగా..  నీకేమైనా మెంటలా? ఆ రోజు పట్టుకున్నప్పుడే నేను నీకు ఫోన్ చేశానా? లేదా? ఏం మాట్లాడుతున్నావ్. నేనంటే రెస్పెక్ట్ లేదా? అందరిని అయితే వదిలిపెడతావ్. నాన్సెన్స్.. నీవు పంపిస్తావా? లేదా చెప్పు. నా కాళ్లు పట్టుకుని పోస్టింగ్ తెచ్చుకున్నావ్. రెండు నిమిషాల్లో వెళ్లిపోతావ్.. ఎక్స్‌ట్రాలు చేయొద్దు.. లేదంటే ఎస్పీకి, డీజీపీకి చెబుతా అంటూ ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చారు. 


అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలను పట్టుకున్న పాపానికి ఓ సీఐను ఎమ్మెల్యే శ్రీదేవి ఇలా బెదిరింపులకు దిగారు. ఆవేశం, ఆగ్రహంతో ఊగిపోయారు. తాను చెప్పినట్లే చేయాల్సిందేనంటూ హుకుం జారీ చేశారు. ఎమ్మెల్యే తీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

Updated Date - 2020-09-19T03:08:31+05:30 IST