499 రూపాయలకే ఆర్టీపీసీఆర్ పరీక్ష
ABN , First Publish Date - 2020-12-15T06:58:03+05:30 IST
డ్రైస్వాబ్ విధానంలో రూ.499కే ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పైస్ హెల్త్ ప్రకటించింది. డ్రైస్వాబ్ ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షా విధానాన్ని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) అభివృద్ధి చేసింది.
సీసీఎంబీతో స్పైస్ హెల్త్ ఒప్పందం
హైదరాబాద్: డ్రైస్వాబ్ విధానంలో రూ.499కే ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పైస్ హెల్త్ ప్రకటించింది. డ్రైస్వాబ్ ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షా విధానాన్ని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) అభివృద్ధి చేసింది. ఈ విధానంలో దేశవ్యాప్తంగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించేందుకు స్పైస్ హెల్త్. సీసీఎంబీతో ఒప్పందం కుదుర్చుకుంది. డ్రైస్వాబ్ విధానంలో తేలిగ్గా, వే గంగా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఫలితంగా వేగంగా ఆర్టీపీసీఆర్ పరీక్షా ఫలితాలను వెల్లడించవచ్చు.