నిట్ పూర్వ విద్యార్థుల సంఘం ప్రపంచ అధ్యక్షుడిగా ఆలపాటి ప్రసాద్
ABN , First Publish Date - 2020-12-15T15:19:38+05:30 IST
నిట్ వరంగల్ పూర్వ విద్యార్థుల సంఘం ప్రపంచ అధ్యక్షుడిగా విజయవాడకు చెందిన ఆలపాటి
విజయవాడ సిటీ, డిసెంబరు 14: నిట్ వరంగల్ పూర్వ విద్యార్థుల సంఘం ప్రపంచ అధ్యక్షుడిగా విజయవాడకు చెందిన ఆలపాటి ప్రసాద్ ఎన్నికయ్యారు. 1978లో నిట్ వరంగల్ నుంచి ఆయన పట్టభద్రులయ్యారు. 2020-22కి జరిగిన ఎన్నికల్లో ఆలపాటి ప్రసాద్ అధ్యక్షుడిగా, బిజు ఫిలిప్పోస్ ఉపాధ్యక్షుడిగా, గంజి మురళీకృష్ణ కార్యదర్శిగా ఎన్నికయ్యారు