Kartakam horoscope weekly star 11/05/2020
ABN , First Publish Date - 2020-05-11T18:07:46+05:30 IST
Kartakam horoscope weekly star 11/05/2020
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష: లక్ష్య సాధనకు ఓర్పు ప్రధానం. యత్నాలు విరమించుకోవద్దు. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. శని, ఆదివారాల్లో పనులు అప్పగించవద్దు. బాధ్యతగా వ్యవహరించండి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. నమ్మకస్తులే తప్పు దారి పట్టించే ఆస్కారం ఉంది. అప్రియమైన వార్తలు వింటారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలు ఎదురవుతాయి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి.