ఏది నిజం?
ABN , First Publish Date - 2020-04-14T05:43:42+05:30 IST
కరోనా ఉద్ధృతి కారణంగా పలు పట్టణాలు ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తున్నాయి. అయితే ఇలాంటి కీలక సమయంలో ధరించే ఫేస్‌మాస్క్‌లను శుభ్రపరిచే విధానాలు, చిట్కాల గురించి సోషల్ మీడియాలో కొన్ని నకిలీ వార్తలు వైరల్ ...
కరోనా ఉద్ధృతి కారణంగా పలు పట్టణాలు ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తున్నాయి. అయితే ఇలాంటి కీలక సమయంలో ధరించే ఫేస్‌మాస్క్‌లను శుభ్రపరిచే విధానాలు, చిట్కాల గురించి సోషల్ మీడియాలో కొన్ని నకిలీ వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ నిజాలు గ్రహించకుండా ఈ చిట్కాలను గుడ్డిగా అనుసరిస్తే, ఫేస్‌మాస్క్‌లు ఎందుకూ పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది.
- వస్త్రంతో తయారైన మాస్క్ వాడుతూ ఉంటే, దాన్ని ప్రతి రోజూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
- ఒకవేళ ఎన్ - 95 మాస్క్ వాడుతూ ఉంటే, దాన్ని ఉతుక్కోకూడదు. ఉతికితే నీటి వల్ల దాని లోపలి వడపోత లేయర్లలోని ఎలక్ర్టోస్టాటిక్ ఛార్జ్ తొలగిపోతుంది. ఫలితంగా మాస్క్ ప్రభావం తగ్గుతుంది.
- మాస్క్‌లను మైక్రోవేవ్ ఓవెన్‌లో స్టెరిలైజ్ చేయకూడదు. ప్లాస్టిక్ బ్యాగ్‌లో మాస్క్ ఉంచి, మైక్రోవేవ్ ఓవెన్‌లో రెండు నుంచి మూడు నిమిషాల పాటు స్టెరిలైజ్ చేసుకోవచ్చని సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయి. వీటిని అనుసరించకండి. ఇలా చేస్తే, మాస్క్ కరిగిపోవడమే కాదు, కొన్ని సందర్భాల్లో అగ్ని ప్రమాదమూ జరిగే వీలుంది. సోషల్ మీడియాలో వస్తున్న నకిలీ వార్తల పట్ల అప్రమత్తంగా వ్యవహరించండి.