బ్లాక్ అండ్ గ్రే
ABN , First Publish Date - 2020-06-17T06:00:13+05:30 IST
అనన్యా పాండే... బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది ఏడాది కిందటే అయినా, పాపులారిటీలో మాత్రం పీక్‌లోకి వెళ్లిపోయింది. ఒకప్పటి హీరో చంకీ పాండే వారసురాలు కావడంతో అందరి చూపు ఆమెపై ఉండడం సహజమే! కానీ అంతకు మించి లేటెస్ట్ స్టయిల్స్‌ను...
అనన్యా పాండే... బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది ఏడాది కిందటే అయినా, పాపులారిటీలో మాత్రం పీక్‌లోకి వెళ్లిపోయింది. ఒకప్పటి హీరో చంకీ పాండే వారసురాలు కావడంతో అందరి చూపు ఆమెపై ఉండడం సహజమే! కానీ అంతకు మించి లేటెస్ట్ స్టయిల్స్‌ను పరిచయం చేస్తూ, సామాజిక మాధ్యమాల్లో బిజీగా ఉంటుంది అనన్య. ప్రత్యేకించి లాక్‌డౌన్‌లో రొమాంటిక్ ఫొటోలతో మురిపిస్తోంది. అలాంటి పోజే ఇది. బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అనన్యను ఇలా ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి అభిమానులు లైక్‌లపై లైక్‌లు కొడుతున్నారు.
అన్నట్టు తొలి సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్-2’తో ‘బెస్ట్ ఫిమేల్ డెబ్యూ’ అవార్డు కూడా అందుకుందీ బ్యూటీ. తరువాత ‘పతీ పత్నీ ఔర్ వో’ కామెడీ చిత్రంలో నవ్వులు పండించింది.