బాయ్‌ఫ్రెండ్‌ డిటెక్టివ్‌ అయితే..!

ABN , First Publish Date - 2020-11-11T06:13:30+05:30 IST

‘అర్జెంట్‌గా రమ్మని చెప్పాను కదా..! ఇప్పుడా వచ్చేది’ అంటూ బైక్‌పై వచ్చిన బాయ్‌ఫ్రెండ్‌ సన్నీని విసుక్కొంటుంది మౌని.

బాయ్‌ఫ్రెండ్‌ డిటెక్టివ్‌ అయితే..!

 ‘అర్జెంట్‌గా రమ్మని చెప్పాను కదా..! ఇప్పుడా వచ్చేది’ అంటూ బైక్‌పై వచ్చిన బాయ్‌ఫ్రెండ్‌ సన్నీని విసుక్కొంటుంది మౌని. ‘ఆఫీ్‌సలో వర్క్‌ ఎక్కువగా ఉంది. అందుకే లేటయింది’ అంటాడు సన్నీ. నమ్మదు మౌని. వెంటనే ఆఫీ్‌సకు ఫోన్‌ చేసి, సన్నీ ఎప్పుడు బయలుదేరాడో వాకబు చేస్తుంది. ‘పది నిమిషాల కిందటే’ అని వాళ్లు చెప్పడంతో ఊపిరి పీల్చుకుంటుంది. ‘ఏంటి నన్నే అనుమానిస్తున్నావా? డిటెక్టివ్‌ అవతారం ఎత్తావా’ అంటూ సన్నీ కోపంగా అంటాడు.


మగాళ్లు కూడా డిటెక్టివ్‌లా మారితే ఎలా ఉంటుందో చూపించాలనుకొంటాడు సన్నీ. ఒకరోజు ‘డిటెక్టివ్‌ సన్నీ’నంటూ మౌని ఇంటికెళతాడు. ఆమె లోపలికి వెళ్లగానే హాల్లో ఉన్న ఆమె ఫోన్‌ చూస్తాడు. అందులో ‘ఐ లవ్‌ యూ’ అని ఎవరికో పంపిన వాట్సప్‌ మెసేజ్‌ కనిపిస్తుంది. మౌనిని నిలదీస్తాడు. సన్నీ చెంప ఛెళ్లుమనిపించి... ‘అది మా కజిన్‌ నంబర్‌రా’ అంటుంది.


మనోడు షాకవుతాడు. అలా ప్రతి విషయంలో ఏదో ఒకటి కనుక్కొని, సందేహించడం మొదలుపెడతాడు. ‘అసలు ఎందుకురా ఇలా అనుమానిస్తున్నావు’ అని అడుగుతుంది. ‘ఎప్పుడూ మీ ఆడవాళ్లే అనుమానిస్తారా? మా మగవాళ్లు కూడా అనుమానిస్తే ఎలా ఉంటుందో చూపించడానికే ఇలా చేస్తున్నా’ అంటాడు సన్నీ.


చివరకు ఓ చిన్న సరదా డైలాగ్‌తో ముగుస్తుంది ‘బాయ్‌ఫ్రెండ్‌ డిటెక్టివ్‌ అయితే’ లఘుచిత్రండీక్‌ సన్ని... సన్నీగా, మౌనికా... మౌనిగా నటించారు. యూట్యూబ్‌లో విడుదలైన ఈ లఘుచిత్రం వేలల్లో వ్యూస్‌ సంపాదించింది.


Updated Date - 2020-11-11T06:13:30+05:30 IST