ట్రెండీ టచ్‌

ABN , First Publish Date - 2020-11-25T06:25:59+05:30 IST

అమెరికా లాస్‌ఏంజిల్స్‌లో ఇటీవల జరిగిన ‘అమెరికన్‌ మ్యూజిక్‌ అవార్డ్స్‌’ వేడుక సరికొత్త ఫ్యాషన్లకు వేదిక అయింది. ఈవెంట్‌కు ముందు రెడ్‌ కార్పెట్‌పై హాలీవుడ్‌ తారలతో పాటు పాప్‌ సంగీత ప్రముఖులు భిన్నమైన డ్రెస్సుల్లో అలరించారు...

ట్రెండీ టచ్‌

అమెరికా లాస్‌ఏంజిల్స్‌లో ఇటీవల జరిగిన ‘అమెరికన్‌ మ్యూజిక్‌ అవార్డ్స్‌’ వేడుక సరికొత్త ఫ్యాషన్లకు వేదిక అయింది. ఈవెంట్‌కు ముందు రెడ్‌ కార్పెట్‌పై హాలీవుడ్‌ తారలతో పాటు పాప్‌ సంగీత ప్రముఖులు భిన్నమైన డ్రెస్సుల్లో అలరించారు. వేడక మొత్తానికి హైలైట్‌ నటి, గాయని, నర్తకి, నిర్మాత, ఫ్యాషన్‌ డిజైనర్‌ జెన్నిఫర్‌ లోపెజ్‌. సిల్వర్‌ కలర్‌ క్రాప్‌టాప్‌, హైకట్‌ స్కర్ట్‌లో నిజంగానే నక్షత్రంలా మిరిమిట్లు గొలిపిందీ భామ.


ఫ్రాన్స్‌ లగ్జరీ ఫ్యాషన్‌ హౌస్‌ రూపొందించిన ఈ ‘బాల్మైన్‌’లో... షోకు రొమాంటిక్‌ టచ్‌నిచ్చింది. దానికి జతగా ఆభరణాలు అద్దిన హైహీల్స్‌ వేసుకుంది. తామూ ఏమీ తక్కువ కాదంటూ ఇతర సెలబ్రిటీలూ పోటీపడ్డారు. అమెరికన్‌ ర్యాపర్స్‌ మేగన్‌ ఫాక్స్‌, మిషన్‌ గన్‌ కెల్లీలు జంటగా వచ్చి మురిపించారు. ఇక్కడ అందర్నీ ఆకర్షించింది కెల్లీ ఛాతీపై వేసుకున్న కలర్‌ఫుల్‌ టాటూలు. అతడు ధరించిన విచిత్రమైన వైట్‌ సూట్‌లో నుంచి ఆ టాటూలు ఇన్నర్‌వేర్‌లా కనిపిస్తాయి. ఇలాంటి ట్రెండీ ఫ్యాషన్లు అక్కడ ఇంకా ఎన్నో!

Updated Date - 2020-11-25T06:25:59+05:30 IST