డిజిటల్‌ తెరలే ర్యాంప్‌లు

ABN , First Publish Date - 2020-09-23T05:30:00+05:30 IST

ఇది నయా యుగం. కరోనా తరువాతి జీవితం. ప్రతి రంగం ముఖచిత్రం మారుతున్న ఈ విపత్కాలంలో ఫ్యాషన్‌ తన రూటు మార్చుకుంది.

డిజిటల్‌ తెరలే ర్యాంప్‌లు

ఇది నయా యుగం. కరోనా తరువాతి జీవితం. ప్రతి రంగం ముఖచిత్రం మారుతున్న ఈ విపత్కాలంలో ఫ్యాషన్‌ తన రూటు మార్చుకుంది. పదివేల వోల్టుల వెలుగుల్లో... క్యాట్‌ వాక్‌లతో కేక పుట్టించే ‘మిస్‌’మిస అందాలు ఈసారి ‘తెర’ మరుగయ్యాయి.


చరిత్రలో తొలిసారిగా ‘న్యూయార్క్‌ ఫ్యాషన్‌ వీక్‌’ (ఎన్‌ఎఫ్‌డబ్ల్యూ), ‘లండన్‌ ఫ్యాషన్‌ వీక్‌’ (ఎల్‌ఎఫ్‌డబ్ల్యూ), ‘ఇండియా కౌచర్‌ వీక్‌’ (ఐసీడబ్ల్యూ) వంటి మెగా ఫ్యాషన్‌ షోలకు డిజిటల్‌ తెరలే ర్యాంపులయ్యాయి. ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబించేలా స్టయిల్సూ విభిన్నంగా కనిపించాయి.




సంప్రదాయం... పాశ్చాత్యం... డ్రెస్‌లు ఏవైనా మాస్క్‌లు మాత్రం సాధారణమైపోయాయి. అందుకే బడా డిజైనర్లు తమ కలెక్షన్‌లో వీటిని చేర్చారు. మాస్క్‌లు ధరించినా ముఖారవిందం మిరిమిట్లు గొలిపేలా ట్రాన్స్‌ఫరెంట్‌ డిజైన్లు రూపొందించారు. ‘లండన్‌ ఫ్యాషన్‌ వీక్‌’లో ఇవే ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 




ఫ్యాషన్‌ ఫిలిమ్‌... 

ఇక భారత ప్రముఖ డిజైనర్‌ ఫల్గుణీ షేన్‌ పీకాక్‌ ‘స్పెక్టాకిల్‌ ప్రైవ్‌’ పేరుతో మొట్టమొదటిసారి ఓ ఫ్యాషన్‌ ఫిలిమ్‌ రూపొందించారు. ‘ఇండియా కౌచర్‌ వీక్‌’లో దీన్ని విడుదల చేశారు. కరోనా కాలంలో రూపు రేఖలు మార్చుకొంటున్న ఫ్యాషన్‌ రంగాన్ని, దాని భవిష్యత్‌ చిత్రాన్ని ఇందులో ఆవిష్కరించారు.       


Updated Date - 2020-09-23T05:30:00+05:30 IST