దుమ్ము రేపేందుకు రెడీనా!
ABN , First Publish Date - 2020-07-01T05:52:49+05:30 IST
సూపర్‌బైక్‌లపై మనసు పడే కుర్రకారు కోసం డుకాటీ సరికొత్తగా ముస్తాబైంది. నవతరం ఇష్టపడే ఎన్నో హంగులనద్ది ‘పనిగల్-వీ2’ మోడల్‌ను మార్కెట్‌లోకి వదిలేందుకు సన్నాహాలు చేస్తోంది...
కొత్త బండి గురూ!
సూపర్‌బైక్‌లపై మనసు పడే కుర్రకారు కోసం డుకాటీ సరికొత్తగా ముస్తాబైంది. నవతరం ఇష్టపడే ఎన్నో హంగులనద్ది ‘పనిగల్-వీ2’ మోడల్‌ను మార్కెట్‌లోకి వదిలేందుకు సన్నాహాలు చేస్తోంది. నిజానికి ఈ మిడిల్ వెయిట్ సూపర్‌బైక్ ఈపాటికే రోడ్డెక్కాల్సింది. కానీ, కరోనా కల్లోలం వల్ల ఆలస్యమైంది. అన్నీ కుదిరితే ఈ నెలలోనే విడుదల కావచ్చని సమాచారం.
ఇవీ ప్రత్యేకతలు...
- డుకాటీ ‘పనిగల్-వీ2’ బైక్‌లో 995 సీసీ సూపర్ క్వాడ్రో ఇంజన్ ఉంది.
- ‘పనిగల్-వీ4’తో పోలిస్తే... డిజైన్ పరంగా ఇంచూ మించు ఒకేలా కనిపిస్తుంది. అయితే వీ2లో ట్విన్ సిలిండర్ పవర్‌ట్రయిన్ కాస్త చిన్నగా ఉంటుంది.
- రేస్, స్పోర్ట్స్, స్ట్రీట్... ఈ 3 మోడ్స్‌ను బైక్ ముందున్న 4.3 అంగుళాల టీఎఫ్‌టీ స్ర్కీన్‌పై నియంత్రించవచ్చు.
- ఇంజన్ 10750 ఆర్‌పీఎం వద్ద 153 బీహెచ్‌పీ శక్తిని, 9000 ఆర్‌పీఎం వద్ద 104 ఎన్‌ఎం టార్క్‌ను అందిస్తుంది. సిక్స్ గేర్ బైక్ ఇది.
- బైక్ ముందు భాగంలో ఎడ్జస్టబుల్ షోవా బీపీఎఫ్ ఫోర్క్ ఉంటే... వెనుక వైపు మాత్రం సాచ్స్ ఎడ్జస్టబుల్ మోనోషాక్ అబ్జార్బర్స్ అమర్చారు.
- ముందు వైపు మోనోబ్లాక్ కాలిపర్స్ బ్రేక్స్, వెనుక చక్రానికి సింగిల్ 2445 ఎంఎం డిస్క్ బ్రేక్ ఉన్నాయి.
- యూరో 5 ఉద్గార ప్రమాణాలు కలిగి ఉన్న ఈ బైక్ లుక్ అదిరిపోతుంది. ఎల్‌ఈడీ రన్నింగ్ ల్యాంప్స్ బైక్ ముందు, వెనుక భాగాల్లో ఉండడం, ఎగ్జాస్ట్ ప్యాకేజీని కనిపించీ, కనిపించనట్లుగా అందంగా బైక్ డిజైన్‌లో ఇమడ్చడం లగ్జరీ లుక్‌నిస్తాయి.
- సూపర్ బైక్‌లలో దాదాపుగా కనిపించే క్విక్ షిప్టర్, యాంటీ వీలీ సిస్టమ్, కార్నరింగ్ ఏబీఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
- ధర సుమారు రూ.16 లక్షలు ఉండవచ్చని అంచనా.
డుకాటీ ‘పనిగల్-వీ2’
ప్రత్యేకతలు: మిడిల్ వెయిట్ సూపర్‌బైక్. 995సీసీ సూపర్ క్వాడ్రో ఇంజన్,
4.3 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే. ఈ నెలాఖరులో విడుదల కావచ్చు.
ధర: రూ.16 లక్షలు (అంచనా)