సోంపుతో ఫేస్‌ప్యాక్‌!

ABN , First Publish Date - 2020-07-25T05:30:00+05:30 IST

ప్రస్తుత సమయంలో ఇంటి వద్ద తయారుచేసుకున్న ఫేస్‌ప్యాక్‌లు వాడడమే మంచిది. తక్కువ సమయంలోనే సోంపుతో ముఖానికి వన్నె తేవచ్చు. అదెలాగో చూద్దాం...

సోంపుతో ఫేస్‌ప్యాక్‌!

ప్రస్తుత సమయంలో ఇంటి వద్ద తయారుచేసుకున్న ఫేస్‌ప్యాక్‌లు వాడడమే మంచిది. తక్కువ సమయంలోనే సోంపుతో ముఖానికి  వన్నె తేవచ్చు. అదెలాగో చూద్దాం...

  1. టీ స్పూన్‌ సోంపును మెత్తటి పొడిగా చేసుకోవాలి. దాన్ని ఒక గిన్నెలో తీసుకొని టీ స్పూన్‌ తేనె, టీ స్పూన్‌ పెరుగు కలపాలి. ఈ ఫేస్‌ప్యాక్‌ను బ్రష్‌ సాయంతో ముఖం, మెడ చుట్టూ రాసుకోవాలి. పది నిమిషాలయ్యాక స్క్రబ్బర్‌ సాయంతో తొలగించి, చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. 
  2. రెండు టేబుల్‌ స్పూన్ల సోంపును గ్లాసు నీళ్లలో తీసుకొని మరిగించాలి. చల్లారిన తర్వాత ఆ సోంపు నీటిని ముఖానికి టోనర్‌గా రాసుకోవాలి. దాంతో మచ్చలు తొలగి, ముఖం తాజాగా కనిపిస్తుంది.

Updated Date - 2020-07-25T05:30:00+05:30 IST