గో యూఎస్‌ఏ
ABN , First Publish Date - 2020-11-04T06:12:31+05:30 IST
రంగం ఏదైనా మార్పు సహజమైపోయిందిప్పుడు. ముఖ్యంగా సాంకేతికత అభివృద్ధి చెందిన తరువాత టెలివిజన్ స్వరూపం మారిపోయింది.
రంగం ఏదైనా మార్పు సహజమైపోయిందిప్పుడు. ముఖ్యంగా సాంకేతికత అభివృద్ధి చెందిన తరువాత టెలివిజన్ స్వరూపం మారిపోయింది. టీవీల కేబుల్స్ కట్ అవుతున్నాయి. డిజిటల్ తెరలై ఇంటర్‌నెట్‌కు వేదికలవుతున్నాయి. ‘స్మార్ట్’గా చేతిలో ఒదిగిపోతున్నాయి. కానీ ఇంట్లో ఉన్నా... బయటకు వెళ్లినా... దేశవిదేశాల్లో షికార్లు కొట్టినా... ఎప్పుడూ కనెక్టయ్యే ఉంటున్నాయి. అలాంటి ఓ వినూత్న ఛానలే ‘గో యూఎ్‌సఏ టీవీ’.
పర్యాటకం... వంటకం... వినోదం... అన్నింటినీ ఒకేచోట వీక్షించేలా ఈ టీవీని మలిచారు. అంతేకాదు... పాపులర్ ఓటీటీల్లో నచ్చిన సినిమాలు, వెబ్ సిరీ్‌సలు, డాక్యుమెంటరీలు, సీరియల్ ఎపిసోడ్లు కూడా ఇందులో చూసేయవచ్చు. అదీ ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేకుండా! అమెరికా వెళ్లే విదేశీ పర్యాటకులకు అక్కడి పర్యాటక ప్రాంతాల గురించిన సమాచారం, వాటి వీడియోలు కూడా ఇందులో ఉంటాయి. రోడ్ ట్రిప్స్, గ్రేట్ అవుట్‌డోర్స్, ఫుడ్డీ హాట్‌స్పాట్స్... ఒకటేమిటి ఒకే ఒక్క ‘ట్యాప్’లో ఏది కావాలంటే అది ప్రత్యక్షమవుతుంది. ఆయా ప్రాంతాల ప్రత్యేకతలు... రుచుల కేరాఫ్ అడ్రెస్‌లు... ప్రతిదీ స్టోరీ టెల్లింగ్‌లా కనిపిస్తుంది.
లక్షలమంది పర్యాటకులకు కచ్చితమైన సమాచారం అందించడంతో పాటు వినోదాన్ని కూడా పంచాలనే ఉద్దేశంతో తెచ్చిందే ‘గో యూఎ్‌సఏ టీవీ’ అంటారు నిర్వాహకులు. మొబైల్ ఫోన్లలో కూడా వీక్షించేలా యాప్‌ను రూపొందించారు. కావాలనుకొంటే ఇందులో వీడియోలను షేర్ చేసుకోవచ్చు. సబ్‌స్ర్కిప్షన్లు, లాగిన్లు, ఫీజులు అక్కర్లేకుండా నాన్‌స్టాప్ వినోదాన్ని ఆస్వాదించవచ్చు.
పెద్ద తెరపై చూడాలనుకొంటే గూగుల్ క్రోమ్ ద్వారా కాస్టింగ్ సౌకర్యం కూడా ఉంది. ఫేవరెట్స్‌ను ఎంచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడవచ్చు. అంటే... ఎన్నో రకాల టీవీలు... ఒక్కటే ఛానల్ అన్నమాట!