వ్యక్తిత్వాన్ని చెప్పేస్తాయి!

ABN , First Publish Date - 2020-11-18T05:38:46+05:30 IST

ఎవరి గురించి అయినా ఒక అంచ నాకు రావాలంటే వారి అలవాట్లు, అభిరుచులు తెలిస్తే చాలు. మగువల కనుబొమలు, పెదవులు, కళ్ల రంగు... ఇలా ప్రతిదీ వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయని అంటున్నారు పరిశోధకులు...

వ్యక్తిత్వాన్ని చెప్పేస్తాయి!

ఎవరి గురించి అయినా ఒక అంచ నాకు రావాలంటే వారి అలవాట్లు, అభిరుచులు తెలిస్తే చాలు. మగువల కనుబొమలు, పెదవులు, కళ్ల రంగు... ఇలా ప్రతిదీ వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయని అంటున్నారు పరిశోధకులు. అతివల మనసు చదివేయాలంటే వారి శరీరం తీరును గమనిస్తే చాలు అంటున్నారు పరిశోధకులు. ఎలా అంటారా! చదివేయండి మరి.... 


  1. నిండైన కనుబొమలు: కళ్లు మాత్రమే కాదు కనుబొమలు కూడా మాట్లాడతాయి. ఇదే విషయాన్ని యూనివర్సిటీ ఆఫ్‌ టోరంటో పరిశోధకులు ఒక అధ్యయనంలో తేల్చి చెప్పారు. కనుబొమల తీరును బట్టి పాజిటివ్‌ ఎమోషన్స్‌ను వ్యక్తం చేయడం, చురుగ్గా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిండైన కనుబొమలు ఉన్న మహిళలు తామే గొప్పవారమని, నలుగురిలో తామే ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా కనిపించాలని అనుకుంటారట. 
  2. కళ్ల రంగు: పిట్స్‌బర్గ్‌ యూనివర్సిటీలో అనీస్తిషియా విభాగంలో పరిశోధనలు చేస్తున్న ఇన్నా బెల్ఫర్‌ 2014లో అమెరికన్‌ పేయిన్‌ సొసైటీ సమావేశంలో తన అధ్యయన ఫలితాలను వెల్లడించారు. లేత రంగు కళ్లు ఉన్న మహిళలు కాన్పు సమయంలో పురిటి నొప్పుల బాధ తక్కువగా అనుభవించారు. వీరితో పోల్చితే ముదురు రంగు కళ్లు ఉన్న మహిళలు భిన్నంగా స్పందించారు. అదే నీలం, లేదా ఆకుపచ్చ రంగు కళ్లు ఉన్న మహిళలు పురిటినొప్పుల బాధను ఎక్కువగా అనుభవిస్తారట.
  3. పెదవుల భాష: ఫేస్‌ రీడింగ్‌ నిపుణురాలు, చైనీస్‌ ఫేస్‌ రీడింగ్‌ను అధ్యయనం చేసిన జీన్‌ హానెర్‌ ఏమంటున్నారంటే... పెదవులు పెద్దవిగా ఉన్న మహిళలు దృఢంగా, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు. సర్జరీ ద్వారా పెదవులను తీర్చి దిద్దుకున్న వారు స్వార్థపరులు. సాయం కోసం చూస్తుంటారు. పెదవుల ఆకృతి చక్కగా ఉన్న మహిళల్లో సృజనాత్మకత ఎక్కువ. అంతేకాదు వీళ్లు మంచి సంభాషణాపరులు కూడా. 
  4. ముఖం తీరు: యూనివర్సిటీ ఆఫ్‌ స్టిర్లింగ్‌, బెనెడిక్ట్‌ జోన్స్‌, యూనివర్సిటీ ఆఫ్‌ గ్లాస్గో ముఖం తీరుపై పరిశోధనలు చేశారు. మస్క్‌లిన్‌ ఫేస్‌ ఉన్న మహిళలకు ఎక్కువ  రోజులు కలిసి ఉండే భాగస్వామి దొరకుతారట. 
  5. పొట్ట: ఒత్తిడిలో ఉన్నప్పుడు మహిళల్లో విడుదలయ్యే కార్టిసాల్‌ హార్మోన్‌ పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది. మహిళలు తమ ఒత్తిడిని బయటకు కనిపించకుండా జాగ్రత్తపడతారు.
  6. తొడలు వెడల్పుగా: హిప్స్‌ అబద్ధాలు చెప్పవు. వెడల్పయిన తొడలు ఉన్న మహిళలు ఒక వ్యక్తితో ఒకేసారి శృంగారంలో పాల్గొంటారట. అంతేకాదు తొడలు వెడల్పుగా ఉండడం వల్ల కాన్పు తేలికగా అవుతుందని లీడ్స్‌ యూనివర్సిటీ పరిశోధకులు అంటున్నారు.
  7. పిరుదులు: ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అధ్యయనం ఏం చెబుతోందంటే... పిరుదులు లావుగా ఉన్న మహిళల్లో మెదడు చురుకుగా పనిచేస్తుందట.
  8. పాదాలు: కాలి వేళ్లలో రెండో వేలు బొటన వేలికన్నా పొడవుగా ఉన్న మహిళలు అందరి మీద పెత్తనం చెలాయించాలని చూస్తారు. కాలి రెండో వేలు పొడవుగా ఉండడం అనేది సహజంగా అబ్బిన నాయకత్వ లక్షణాలను సూచిస్తుంది. ఏకకాలంలో ఒకటి కన్నా ఎక్కువ పనులు చేయగల సామర్థ్యం కాలివేళ్లు చిన్నవిగా ఉన్న మహిళల సొంతం. అలానే ఉబినట్టుగా ఉండే కాలి వేళ్లు ఉన్నవాళ్లు చేసే పనిలో నిక్కచ్చిగా, ఆదర్శంగా ఉంటారు. నిటారు వేళ్లు గల మహిళలు హాస్యప్రియులని పాదాల మీద గత కొంత కాలంగా మీద పరిశోధనలు చేస్తున్న లండన్‌కు చెందిన జేన్‌ శీహన్‌ చెబుతున్నారు. 

Updated Date - 2020-11-18T05:38:46+05:30 IST