ఫ్యాషన్ గురు
ABN , First Publish Date - 2020-06-24T05:59:16+05:30 IST
‘నలుగురికీ నచ్చినది నాకసలే నచ్చదురో’... పాట గుర్తుందిగా! భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ హార్డిక్ పాండ్యా కూడా అంతే! అతడు వేసే డ్రెస్‌లకూ... ..
సెలబ్ స్టయిల్
‘నలుగురికీ నచ్చినది నాకసలే నచ్చదురో’... పాట గుర్తుందిగా! భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ హార్డిక్ పాండ్యా కూడా అంతే! అతడు వేసే డ్రెస్‌లకూ... మార్కెట్‌లో ట్రెండ్స్‌కు ఏ మాత్రం పొంతన ఉండదు. అసలు ఆ కాంబినేషన్లు, కలర్లు చూస్తే పిచెక్కిపోతుంది. విభిన్నంగానే కాదు... ఇలాంటి డ్రెస్‌లు కూడా వేసుకొంటారాశ్రీ అనేంతలా ఆశ్చర్యపరుస్తాయి. పూల చొక్కా తొడిగినా... షర్ట్ లేకుండా జర్కిన్‌తో పోజిచ్చినా... కట్ల పామును తలపించే ప్యాంటు ధరించినా... అన్నీ కొత్తగానే కాదు... వింతగానూ ఉంటాయి. అతడి అభిమానుల మాటల్లో చెప్పాలంటే... పాండ్యా ‘ట్రెండ్ ఫాలో అవ్వడు. ట్రెండ్ సెట్ చేస్తాడు’.
ఇక హెయిర్ స్టయిల్ అంటారా..! డ్రెస్‌లకు ఏ మాత్రం తీసిపోదు. ఒంటిపై దుస్తుల్లా... తలపై వెంట్రుకలు కూడా ఉన్నట్టుండి రంగులు మారిపోతుంటాయి. ఒక్కోసారి సగం జుత్తు మాయమైపోతుంది. ఇంకోసారి ఒక పక్క తగ్గిపోతుంది. ఆట ఉన్నంతసేపే హార్దిక్ పాండ్యా! ఒక్కసారి మైదానం వదిలి బయటకు వచ్చాడా... ఫ్యాషన్ పాండ్యానే! ఎక్కడున్నామన్నది కాదు... ఏం వేసుకున్నామన్నదే మనోడికి ముఖ్యం. షాపింగ్... డైనింగ్... ఆఖరికి ఇంట్లో ఉన్నా అతడు సరికొత్త లుక్స్ కోసం ప్రయత్నిస్తూనే ఉంటాడు. అంతటితో ఆగడు... వాటిని ఇన్‌స్టెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేసి... వేల వేల లైక్‌లు కొట్టేస్తుంటాడు. అప్పుడప్పుడూ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌లా చొక్కా తీసేసి కండలు ప్రదర్శిస్తుంటాడు. వాటిపై టాటూలు కుర్రకారుకు లేటెస్ట్ ట్రెండ్‌ను గుర్తు చేస్తుంటాయి. అతడి విభిన్న వస్త్రధారణ చూస్తుంటే విచిత్ర డ్రెస్సుల్లో అలరించే హీరో రణవీర్‌సింగ్‌తో పోటీ పడుతున్నట్టు ఉంటుంది. పాండ్యాకు ఫ్యాన్ ఫాలోయింగూ తక్కువేం కాదు. ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌లోనే మనోడికి 11.6 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.