సమ్‌థింగ్ స్పెషల్
ABN , First Publish Date - 2020-10-07T06:21:42+05:30 IST
క్రియేటివ్ డిజైన్లు కావాలంటే ఫ్యాషన్ షోలకు మించిన వేదికలుండవు. విభిన్న డ్రెస్‌లు ధరించి మోడల్స్ ర్యాంప్‌పై వయ్యారాలు పోతుంటే... చూడ్డానికి రెండు కళ్లూ చాలేవి కాదు. ఒక్కోరిదీ ఒక్కో వెరైటీ. వేటికవేనన్నట్టుగా డిజైన్లు పోటీపడుతుంటాయి...
క్రియేటివ్ డిజైన్లు కావాలంటే ఫ్యాషన్ షోలకు మించిన వేదికలుండవు. విభిన్న డ్రెస్‌లు ధరించి మోడల్స్ ర్యాంప్‌పై వయ్యారాలు పోతుంటే... చూడ్డానికి రెండు కళ్లూ చాలేవి కాదు. ఒక్కోరిదీ ఒక్కో వెరైటీ. వేటికవేనన్నట్టుగా డిజైన్లు పోటీపడుతుంటాయి. ఇది కరోనా కాలం కదా... ఇప్పుడా హొయలు నేరుగా చూసే అవకాశం లేదు. డిజిటల్ తెరలే వేదికలైనాయి. అలాగని క్రియేటివిటికేమీ తక్కువలేదు. మొన్నామధ్య జరిగిన ‘న్యూయార్క్ ఫ్యాషన్ వీక్’లో ‘చిత్రాలి’వి.
ప్రముఖ డిజైనర్ కింబర్లీ గోల్డ్‌సన్ పరిచయం చేసిన ‘అమరా’ స్వెట్‌షర్ట్ డ్రెస్‌లో మోడల్స్ ఇలా ఆకట్టుకున్నారు. అన్నింటికీ మించి ఈ షర్ట్‌పైనున్న మనిషి ముఖం... దానికి హెయిర్‌స్టయిల్. చూడగానే షర్ట్‌పై నిజంగానే ఎవరో ఉన్న అనుభూతి కలుగుతుంది. అందుకేనేమో ఇది ఫ్యాషన్ ప్రియులనే కాకుండా... ప్రపంచ మీడియాను కూడా విపరీతంగా ఆకర్షిం చింది.