చెత్తను చిత్రంగా..

ABN , First Publish Date - 2020-12-02T05:56:35+05:30 IST

సరిగ్గా రెండేళ్ల కిందట ముప్ఫై ఏళ్ల పర్వతారోహకురాలు కిమ్‌ కాంగ్‌ యున్‌ దక్షిణ కొరియాలోనే అతిపెద్దదైన జాతీయ పార్క్‌ ‘మౌంట్‌ జిరి’కి వెళ్లింది. ఆ పర్వత శ్రేణులన్నీ ఎక్కడ చూసినా చెత్తాచెదారంతో నిండిపోయి ఉన్నాయి. దీనికి పరిష్కారం కనుగొనాలనే ఆ క్షణమే ఆమె నిర్ణయించుకుంది...

చెత్తను చిత్రంగా..

సరిగ్గా రెండేళ్ల కిందట ముప్ఫై ఏళ్ల పర్వతారోహకురాలు కిమ్‌ కాంగ్‌ యున్‌ దక్షిణ కొరియాలోనే అతిపెద్దదైన జాతీయ పార్క్‌ ‘మౌంట్‌ జిరి’కి వెళ్లింది. ఆ పర్వత శ్రేణులన్నీ ఎక్కడ చూసినా చెత్తాచెదారంతో నిండిపోయి ఉన్నాయి. దీనికి పరిష్కారం కనుగొనాలనే ఆ క్షణమే ఆమె నిర్ణయించుకుంది. ప్రకృతిని పరిరక్షించాల్సిన బాధ్యత ఏ ఒక్కరిదో కాదు అందరిదీ అనే సందేశాన్ని ఇవ్వాలనుకుంది. దాని కోసం ‘క్లీన్‌ హైకర్స్‌’ పేరిట ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది.


దేశంలో పార్కులుగా మార్చిన పర్వతాలన్నింటిపై పేరుకున్న చెత్త తొలగించడం ఈ బృందం లక్ష్యం. అంతేకాదు... సేకరించిన చెత్తను ఆర్ట్‌గా మలిచి, ప్రపంచానికి ప్రకృతి పరిరక్షణ సందేశాన్ని బలంగా వినిపించడం కూడా వారి ప్రాజెక్ట్‌లో భాగం. ‘‘ఎక్కడపడితే అక్కడ చెత్త పారేయొద్దు అని పదే పదే చెప్పే కంటే, దాన్నంతా ఒక చోట చేర్చి చిత్రంగా పేర్చితే మరింత ప్రభావంతంగా జనంలోకి మా సందేశం వెళుతుందనేది ఆలోచన. మేం ఊహించినట్టే పర్యాటకుల నుంచి మంచి స్పందన వచ్చింది. వారు మా కళాత్మకతను అభినందిస్తూనే, ప్రకృతికి ఎంత చేటు చేస్తున్నారో తెలుసుకొంటున్నారు. మేం కోరుకున్న మార్పు ఇదే’’ అంటూ ఆనందంగా చెబుతుంది కిమ్‌ కాంగ్‌. రెండేళ్ల కిందట ప్రారంభమైన ఆమె ప్రయాణం నేటికీ కొనసాగుతూనే ఉంది. ఇక్కడ చూస్తున్న ఫొటో అందులో భాగమే. మౌంట్‌ మనిపై చెత్తను చిత్రంగా మార్చి దిగిన తాజా ఫొటో ఇది. 

Updated Date - 2020-12-02T05:56:35+05:30 IST