వర్చ్యువల్ వినోదం
ABN , First Publish Date - 2020-12-09T05:30:00+05:30 IST
అసలే కాలేజీ... ఆపై ఫ్రెషర్స్ పార్టీ... ఎంత హంగామా ఉంటుంది! డీజే బీట్‌లు... దుమ్మురేగే డ్యాన్స్‌లు... కలర్‌ఫుల్ డ్రెస్సులు... క్యాట్‌వాక్‌లు... ఒకటా రెండా రోజంతా వినోదాల విందులో నవతరం ఉల్లాసంగా ఊగిపోతుంది...
అసలే కాలేజీ... ఆపై ఫ్రెషర్స్ పార్టీ... ఎంత హంగామా ఉంటుంది! డీజే బీట్‌లు... దుమ్మురేగే డ్యాన్స్‌లు... కలర్‌ఫుల్ డ్రెస్సులు... క్యాట్‌వాక్‌లు... ఒకటా రెండా రోజంతా వినోదాల విందులో నవతరం ఉల్లాసంగా ఊగిపోతుంది. కానీ ఈ కరోనా కాలంలో అవన్నీ దూరమైపోయాయి. అడ్మిషన్లయితే అయిపోయాయి. తరగతులు మొదలైపోయాయి. అయినా క్యాంప్‌సలోకి మాత్రం కుర్రకారు ఇంకా ఎంటరవ్వలేదు. ఫ్రెషర్స్ పార్టీ జరుపుకొనే అవకాశమే రాలేదు. ఆ లోటు విద్యార్థుల్లో అలాగే మిగిలిపోయింది. దీన్ని గ్రహించిన ‘ఢిల్లీ యూనివర్సిటీ’ కొత్త బ్యాచ్ సరికొత్త ఆలోచన చేసింది.
తొలిసారిగా డిజిటల్‌లోనే ఫ్రెషర్స్ పార్టీ నిర్వహించింది. వేదికంటూ దొరకాలి కానీ... ఈతరం ఊరుకుంటుందా! ఎక్కడి వారు అక్కడే ఉన్నా... ఎవరికివారుగా చెలరేగిపోయారు. టాలెంట్ షోలు... సరదాల జల్లులో తడిసి ముద్దయ్యారు. దూరం భౌతికంగానే కానీ... ఆనందాల ఆస్వాదనలో కాదని నిరూపించారు.