జీబ్రా ప్రింట్
ABN , First Publish Date - 2020-11-11T06:09:42+05:30 IST
సరికొత్త డ్రెస్‌లు సృష్టించాలంటే డిజైనర్లకు ఏదో ఒక స్ఫూర్తి కావాలి. అది చుట్టూ పరిసరాలు...
సరికొత్త డ్రెస్‌లు సృష్టించాలంటే డిజైనర్లకు ఏదో ఒక స్ఫూర్తి కావాలి. అది చుట్టూ పరిసరాలు... మనుషులు... ఒక్కోసారి జంతువులు కూడా కావచ్చు! ఇక్కడ మోడల్స్ ధరించిన డ్రెస్‌లు అలాంటివే! జీబ్రా... అంటే చారల గుర్రం స్ఫూర్తిగా రూపొందించినవి! నిజానికి ఈ క్లాసిక్ మోనోక్రోమ్ జీబ్రా ప్రింట్ ఇవాళ్టిది కాదు. ఎనభైల్లోనే బాగా పాపులర్ అయినా, అది కొంత వరకే పరిమితమైంది.
2020లో అదే జీబ్రా ప్రింట్ మరింత వన్నెలద్దుకుని, ఆకట్టుకొనే ట్రెండీ సూట్‌గా రూపాంతరం చెందింది. ముఖ్యంగా క్వారంటైన్ సమయంలో సినీ తారలు, మోడల్స్ ఈ డ్రెస్సుల్లో మెరిసి ఆ పాత రోజులు గుర్తు చేశారు. అంతర్జాతీయ ఫ్యాషన్ షోలలో కూడా బ్లాక్ అండ్ వైట్ జీబ్రా ప్రింటెడ్ సూట్ ధరించి అందాల భామలు వయ్యారాలు ఒలికించారు.
ఇదేనా..! ‘యానిమల్ ప్రింట్’ కూడా బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందిప్పుడు.
చిరుతను తలపించేలా ఉండే డిజైన్లు హాలీవుడ్ సెలబ్రిటీలెందరికో హాట్ ఫేవరెట్.