అక్టోబర్ 12 నుంచి సరిహద్దులను తెరవనున్న దేశాలివే!

ABN , First Publish Date - 2020-10-12T07:17:27+05:30 IST

కరోనా కారణంగా ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. ప్రపంచంలోని దాదా

అక్టోబర్ 12 నుంచి సరిహద్దులను తెరవనున్న దేశాలివే!

న్యూఢిల్లీ: కరోనా కారణంగా ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు మార్చి నుంచి అంతర్జాతీయ రాకపోకలపై నిషేధాన్ని విధించాయి. దీంతో ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లే వారి సంఖ్య మొత్తంగా పడిపోయింది. ఈ కారణంగా ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం కుదేలైంది. అయితే గత మూడు నెలల నుంచి ఒక్కొక్కొ దేశం మళ్లీ తమ సరిహద్దులను తెరుస్తూ ముందుకెళ్తున్నాయి. పర్యాటక రంగాన్ని, ఆర్థిక రంగాన్ని దృష్టిలో పెట్టుకుని కరోనా వ్యాప్తి చెందుతున్నా.. సరిహద్దులను తిరిగి తెరుస్తున్నాయి. ఇక మార్చి నుంచి ఇప్పటివరకు విదేశీయులపై ఆంక్షలు పెట్టిన కొన్ని దేశాలు అక్టోబర్ 12 నుంచి తిరిగి తమ సరిహద్దులను తెరవాలని భావిస్తున్నాయి. ఆ దేశాలు ఏంటో చూద్దామా..


పనామా: కరోనా నేపథ్యంలో మార్చి 23న పనామా అన్ని అంతర్జాతీయ ప్యాసెంజర్ విమానాలపై ఆంక్షలు విధించింది. ఇక అక్టోబర్ 12 నుంచి అంతర్జాతీయ పర్యాటకులకు తిరిగి స్వాగతం పలకేందుకు పనామా సిద్దమైంది. అయితే ఈ దేశంలోకి అడుగుపెట్టేవారు గడిచిన 48 గంటల్లో కరోనా నెగిటివ్ అనే సర్టిఫికెట్‌ను వెంట పెట్టుకుని వెళ్లాలి. లేని యెడల వారంతా క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. 


అర్జెంటీనా: అర్జెంటీనా కూడా అక్టోబర్ 12 నుంచే అంతర్జాతీయ విమానాలను పునరుద్దరించాలని భావిస్తోంది. ఒక రెండు మూడు రోజులు ఆలస్యమైనా అక్టోబర్ 15 నాటికి మాత్రం విమాన రాకపోకలు మొదలవడం ఖాయమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కఠినంగా లాక్‌డౌన్‌ను అమలు చేసిన దేశాల్లో అర్జెంటీనా కూడా ఒకటి. 


గుయానా: దక్షిణ అమెరికాలోని గుయానా కూడా అక్టోబర్ 12 నుంచి అంతర్జాతీయ రాకపోకలను ప్రారంభించనుంది. ఈ దేశ జనాభా దాదాపు ఎనిమిది లక్షలు. ప్రపంచ దేశాల నుంచి లక్షలాది మంది పర్యాటకలు ప్రతి ఏడాది గుయానా పర్యటనకు వెళ్తుంటారు. 


వీటితో పాటు మరిన్ని దేశాలు అక్టోబర్‌లోనే విదేశీ పర్యాటకులను మళ్లీ ఆకర్షించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. పర్యాటకంపైనే ఆధారపడ్డ అనేక దేశాలు ఇప్పటికే సరిహద్దులను తెరిచేశాయి. కరోనా జాగ్రత్తలను పాటిస్తూనే పర్యాటక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. 


Updated Date - 2020-10-12T07:17:27+05:30 IST