రెండు రకాలుగా నటించలేను
ABN , First Publish Date - 2020-02-08T07:40:25+05:30 IST
‘షాపింగ్‌మాల్’తో ‘జర్నీ’ మొదలుపెట్టి ‘సీతమ్మవాకిట్లో..’ సీతగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది అంజలి.
‘షాపింగ్‌మాల్’తో ‘జర్నీ’ మొదలుపెట్టి ‘సీతమ్మవాకిట్లో..’ సీతగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది అంజలి. కెరీర్‌గ్రాఫ్ హైపిచ్‌లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా మాయమైపోయింది. తర్వాత ‘గీతాంజలి’గా మళ్లీ మన ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణతో 11-8-14న జరిగిన ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కేలో తన అంతరంగాన్ని ఆవిష్కరించింది. ఆ వివరాలు తరువాతి పేజీలో...
ఆర్కే : ‘గీతాంజలి’ మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నారా?
అంజలి : అలా అని కాదు. మధ్యలో సినిమాలు చేసినా కూడా గీతాంజలి సినిమాకు హైప్ ఇచ్చేదాన్ని. ఎందుకంటే ఇది నా కెరీర్‌లో ఇంపార్టెంట్ మూవీ.
ఆర్కే : ఎందుకు? హీరోయిన్ ఓరియెంటెడ్ అనా?
అంజలి : నేను ఇప్పటివరకు టైటిల్ రోల్ చేయలేదు. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ చేయలేదు. సో...ఇవన్నీ కూడా నాకు ఈ సినిమాలో లభించాయి. అందుకే అంత ఇంపార్టెన్స్.
ఆర్కే : కెరీర్‌లో అప్ అండ్ డౌన్స్ వచ్చాయి కదా? ఆ సమయంలో ఏమనిపించేది?
అంజలి : అలా జరగాల్సి ఉంది. జరిగింది అంతే అనుకుంటాను. నేను దేన్నైనా పాజిటివ్‌గా తీసుకుంటాను. జరిగిందంతా నా మంచికే అనుకుంటాను. సినిమాల ఎంపికలో చూజీగానే ఉంటాను. అయినా నా కెరీలో ఎందుకలా జరిగిందో తెలియదు.
ఆర్కే : మీ బ్యాక్‌గ్రాండ్ ఏమిటి?
అంజలి : నేను పుట్టి పెరిగింది రాజోలు. స్కూలింగ్ అంతా రాజోలులోనే. తరువాత చెన్నై. మళ్లీ ఇప్పుడు హైదరాబాద్.
ఆర్కే : సినిమాల్లో అవకాశం రావడం కష్టం కదా? మీకెలా అవకాశం వచ్చింది?
అంజలి : సినిమాల్లోకి ఎంట్రీ విషయంలో ఎక్కువగా కష్టపడలేదు. అందుకే నేమో తరువాత కష్టాలు వచ్చాయి. కొన్ని నెలలు మోడల్‌గా చేశాను. ఆ వెంటనే తమిళ, తెలుగు సినిమాలో ఒకేసారి అవకాశం వచ్చింది.
ఆర్కే : ఆ సమస్యలన్నీ ఎందుకు వచ్చాయి?
అంజలి : ఎక్కడైనా ఫ్యామిలీ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. చాలా మంది హీరోయిన్స్ విషయంలోనూ ఇలాగే జరిగింది. ఆ విషయం నాకు తరువాత తెలిసింది. చాలా మంది చెప్పారు.
ఆర్కే : మిమ్మల్ని మోసం చేశారా?
అంజలి : అవును. ఇప్పుడా ఇష్యూ కోర్టులో ఉంది.
ఆర్కే : డబ్బుల విషయంలోనేనా...? పిన్నితో, డైరెక్టర్‌తో మనీ మ్యాటర్సేనా?
అంజలి : అవును. అందరితో మనీ మ్యాటర్సే.
ఆర్కే : సంపాదించినదంతా పోగొట్టుకున్నారా?
అంజలి : అవును. ఇప్పటి వరకు సంపాదించినదంతా పోయింది. మళ్లీ మొదటికొచ్చాను.
ఆర్కే : నీలో ఇంత కాన్ఫిడెన్స్ లెవల్ ఉంది? మరి ఎందుకు అలా మాయమైపోయావు?
అంజలి : ఫస్ట్ థింగ్ అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే నేను మాయమైపోలేదు. నాకు నేనుగా బ్రేక్ తీసుకోవాలనుకున్నాను. నన్ను నా వాళ్లే చీట్ చేశారు. అలాంటి పరిస్థితుల్లో, అన్ని సమస్యల మధ్య నేను సినిమాలు చేయడం కరెక్ట్ కాదనిపించింది. అంతేగానీ, నేనెక్కడికీ పారిపోలేదు. అందరూ మిస్సింగ్ మిస్సింగ్ అంటే నాకే ఆశ్చర్యంగా అనిపించింది.
ఆర్కే : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మీది సీత క్యారెక్టర్ కదా? ఆ పాత్ర తరువాతే ఈ కష్టాలు వచ్చాయని అనుకున్నారా?
అంజలి : చాలా మంది అన్నారు. ఆ నేమ్ అంటే కష్టాలు వస్తాయని. అయితే ఆ సినిమాతోనే నేను తెలుగులో ప్రూవ్ చేసుకోగలిగాను.
ఆర్కే : ఇండస్ట్రీలో మీకు గాడ్‌ఫాదర్ ఎవరు?
అంజలి : గాడ్‌ఫాదర్స్ ఎవరూ లేరు. కాకపోతే స్నేహితులు ఉన్నారు. వారితో డిస్కస్ చేస్తుంటాను. సలహాలు తీసుకుంటూ ఉంటాను.
ఆర్కే : స్నేహితులు మోసం చేయరనే నమ్మకం ఉందా?
అంజలి : అందుకే కదా! ఎవ్వరినీ పూర్తిగా నమ్మడం లేదు. నన్ను తప్ప ఎవ్వరినీ నమ్మాలని అనిపించడం లేదు.
ఆర్కే : మీ అమ్మగారు మీతోనే ఉన్నారా?
అంజలి : ఆ... నాతోనే ఉన్నారు.
ఆర్కే : జరిగిన సంఘటనలు బాగా బాధ కలిగించాయా?
అంజలి : నా మెంటాలిటీ పూర్తిగా డిఫరెంట్. నేను ఎక్కువగా బాధపడను. ఎక్కువగా సంతోషించను. ఎక్కువగా ఏడ్వను. ఏదైనా రెండు నిమిషాలు అంతే.. ఆ తరువాత మామూలై పోతాను. నా క్లోజ్ ఫ్రెండ్స్‌కి ఈ విషయం బాగా తెలుసు.
ఆర్కే : ఆవిడ కంట్రోల్‌లో ఉన్నప్పుడు రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్న విషయం కూడా చెప్పేది కాదా?
అంజలి : అంత డిటేల్డ్‌గా తెలుసుకోలేదు. చాలా దగ్గరి వారు కాబట్టి డౌట్ పడాల్సిన అవసరం రాలేదు.
ఆర్కే : సినిమాలో నటిస్తున్నప్పుడు ఒక సినిమాకు ఎంత ఇస్తున్నారో తెలుసుకోవాలనే క్యూరియాసిటి ఉంటుంది కదా?
అంజలి : అవును. కాకపోతే నా దగ్గరి మనుషులు చూసుకుంటున్నారు. నా గురించి చాలా కేర్ తీసుకుంటున్నారని అనుకున్నాను. పైగా నాకు మనీపైన ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అందుకే రెమ్యునరేషన్ ఎంతనేది తెలుసుకోలేదు.
ఆర్కే : ఇప్పుడు మనీ మీద ఇంట్రస్ట్ వచ్చిందా?
అంజలి : ఇప్పుడు కూడా రాలేదు. నాకు మనీపైన ఇంట్రస్ట్ ఉండదు. కాకపోతే నా అవసరాలకు తగిన విధంగా డబ్బును మేనేజ్ చేసుకుంటాను.
ఆర్కే : సీతమ్మ వాకిట్లో సినిమాలో ట్రెడిషనల్ డ్రెస్, టిపికల్ క్యారెక్టర్ చేశారు. కానీ ఇప్పుడు గ్లామర్ రోల్స్ చేస్తున్నారు కదా?
అంజలి : ఆ సినిమాలో ఆ క్యారెక్టర్‌కు తగినట్టుగా చేశాను. బలుపు సినిమాలో డాక్టర్ క్యారెక్టర్. దానికి తగినట్టుగా చేశాను. క్యారెక్టర్ ఎలా డిమాండ్ చేస్తే అలా చేసుకుంటూ వస్తున్నాను.
ఆర్కే : అంటే ఎలాంటి లిమిటేషన్స్ లేవు. అంతేనా?
అంజలి : లిమిటేషన్స్ ఉన్నాయి.
ఆర్కే : అదేంటి? ఈ మధ్య అందరూ హీరోయిన్స్ నో లిమిటేషన్ అంటున్నారు కదా?
అంజలి : నేను మిగతా వారిలా చేయలేను. రొటీన్ హీరోయిన్ అని అనిపించుకోదలచుకోలేదు.
ఆర్కే : ‘సింగం’ మూవీలో ఒకటి చేసినట్టున్నారు?
అంజలి : అది పర్సనల్ రిక్వెస్ట్‌పైన చేశాను. డైరెక్టర్ హరిగారు, సూర్యగారు పర్సనల్‌గా అడిగారు. అందుకే ఆ సాంగ్ చేశాను. పాత్ర నచ్చితే ఏదయినా చేస్తా.. అలా అని అతిగా ఎక్సపోజింగ్ చేయను. నన్ను ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఇష్ట పడుతున్నారు.
ఆర్కే : ఇప్పుడు మీరు టాప్ హీరోయిన్ పొజిషన్‌లో ఉన్నారా? అంటే లేదు. అలా అని పూర్తిగా క్రేజ్ లేకుండా పోయిందా? అంటే అదీ లేదు. ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న మీరు ఈ స్థాయిలో ఉండటం ఎలా అనిపిస్తుంది?
అంజలి : ఈ ఫ్రైడే గుర్తుంచుకుని నెక్ట్స్ ఫ్రైడే మరచిపోయే హీరోయిన్ల జాబితాలో ఉండటం నాకిష్టం లేదు. తెలుగులో నేను చేసినవి మూడు సినిమాలే అయినా నాకు చాలా గుర్తింపునిచ్చాయి. పది సినిమాలు చేసిన హీరోయిన్‌కు రాని గుర్తింపు నాకు వచ్చింది. నాకది చాలు. నేను దాన్ని నిలబెట్టుకుంటాను.
ఆర్కే : తమిళంలో కళంజియన్ మూవీ పూర్తి చేస్తే తప్ప వేరే సినిమా చేయకూడదని ఆర్డర్ పాస్ చేశారు కదా? ఎందుకలా జరిగింది?
అంజలి : అలాంటిదేమీ జరగలేదు. అదంతా గాసిప్. యూనియన్ ఆర్డర్ పాస్ చేస్తే ఎవ్వరైనా పాటించాల్సిందే. కానీ నా విషయంలో వాళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జరిగిన సంఘటన గురించి వారికి పూర్తిగా తెలుసు.
ఆర్కే : ఇప్పుడు ఏయే సినిమాలు చేస్తున్నారు?
అంజలి : తమిళంలో ఒక మూవీ చేస్తున్నాను. కన్నడలో ఒక మూవీ చేస్తున్నాను. తెలుగులో రెండు, మూడు స్ర్కిప్ట్స్ విన్నాను. త్వరలో ఫైనలైజ్ అవుతాయి.
ఆర్కే : గీతాంజలి సినిమాను మీరు చూజ్ చేసుకున్నారా? వాళ్లే మిమ్మల్ని చూజ్ చేసుకున్నారా?
అంజలి : ఫస్ట్ వాళ్లు నన్ను ఎంపిక చేసుకున్నారు. ఆ తరువాత నేను చూజ్ చేసుకున్నాను.
ఆర్కే : సీత క్యారెక్టర్ ఆఫర్ ఎలా వచ్చింది?
అంజలి : జర్నీ సినిమాలో నా పర్‌ఫెర్మాన్స్ చూసి, నచ్చి తీసుకున్నారు.
ఆర్కే : జర్నీ డబ్బింగ్ సినిమానా?
అంజలి : అవును. కానీ చాలా మంది దాన్ని డబ్బింగ్ మూవీ అనుకోరు. ఆ సినిమాలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పాను.
ఆర్కే : మీ సినిమాలకు మీరే డబ్బింగ్ చెప్పుకుంటారా?
అంజలి : నా ఫస్ట్ మూవీ నుంచి నేనే డబ్బింగ్ చెప్పాను.
ఆర్కే : తమిళం, తెలుగు, కన్నడం మాట్లాడతారా?
అంజలి : తమిళం, తెలుగు బాగా మాట్లాడతాను. కన్నడ ఇప్పుడే నేర్చుకుంటున్నాను.
ఆర్కే : ఎనిమిదేళ్ల కెరీరీలో బాగా బాధపెట్టిన సంఘటన ఏది?
అంజలి : ఇదే టాప్ రేటింగ్‌లో ఉంటుంది. మిగతావన్నీ చాలా చాలా చిన్నవి.
ఆర్కే : హీరోయిన్‌గా నిలదొక్కుకోవాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి?
అంజలి : మెంటల్‌గా సా్ట్రంగ్‌గా ఉండాలి. ఒక్కోసారి గ్రాఫ్ పడిపోయినపుడు మళ్లీ నిలదొక్కుకోగలగాలి. హీరోయిన్ అనేది కొంతకాలం మాత్రమే. ఆ తరువాత జీవితం సాగాలన్నా మెంటల్‌గా సా్ట్రంగ్ ఉండాలి కదా.
ఆర్కే : బాధయినా, సంతోషమైనా ఎవరితో ఎక్కువ షేర్ చేసుకుంటారు?
అంజలి : ఫ్రెండ్స్‌తో ఎక్కువ షేర్ చేసుకుంటాను. అమ్మతో షేర్ చేసుకుంటే కూర్చుని బాధపడుతుంది. అందుకే ఎక్కువ షేర్ చేసుకోను.
ఆర్కే : మధ్యలో ఓవర్‌వెయిట్ అయ్యారు. ఎందుకని? కావాలనే అయ్యారా?
అంజలి : లేదు, నేనెప్పుడూ బరువు పెరగలేదు. ఎప్పుడూ ఒకేలా ఉన్నాను. తమిళ సినిమాల్లో కొంచెం బొద్దుగా కనిపించాలి. అందుకే అలా! తెలుగులో స్లిమ్‌గా ఉండాలి. అందుకే ఇప్పుడిలా!
ఆర్కే : ఇలా ఓపెన్‌గా, ఫ్రాంక్‌గా మాట్లాడటం మొదటి నుంచి ఉందా?
అంజలి : నేను మొదటి నుంచి ఇలానే ఉన్నాను. ముందు ఒకరకంగా, వెనకాల ఒకరకంగా నటించడం నాకు రాదు.
ఆర్కే : ఇన్ని సినిమాల్లో సంతృప్తిని ఇచ్చిన సినిమా ఏది?
అంజలి : క్యారెక్టర్‌పరంగా సంతృప్తినిచ్చిన సినిమా జర్నీ. క్యారెక్టర్ పరంగా, వర్కింగ్ పరంగా సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు చాలా సంతృప్తినిచ్చింది. తమిళంలో షాపింగ్‌మాల్ మంచి పేరు తీసుకువచ్చింది.
ఆర్కే : గీతాంజలి సినిమాలో కూడా మీది డామినేటింగ్ క్యారెక్టరేనా?
అంజలి : ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ. హర్షవర్దన్ సీన్స్ కొన్ని ఉంటాయి. కానీ హీరో క్యారెక్టర్ అని చెప్పలేము. కాకపోతే అందరివీ ఇంపార్టెంట్ రోల్స్, బ్రహ్మానందం, శ్రీనివాసరెడ్డి అందరివీ ముఖ్యమైన పాత్రలే. నేనెవరినీ డామినేట్ చేయలేదు.
ఆర్కే : కష్టాల్లో ఉన్నప్పుడు మీకు అండగా ఎవరున్నారు?
అంజలి : ఇండసీ్ట్రలో అందరూ సపోర్టుగానే ఉన్నారు. నాతో వర్క్ చేసిన వారందరికీ నేనేంటో తెలుసు. కాబట్టి వాళ్లందరూ నాకు సపోర్ట్‌గా ఉన్నారు.
ఆర్కే : ఆ సమయంలో బాగా ఏడ్చారా?
అంజలి : ఏడ్చాను. అయితే కొద్ది సేపే. ఇందాకా చెప్పాను గదా. ఏదైనా కొద్దిసేపే. ఎక్కువ సేపు ఏడుస్తూ కూర్చోను. డైవర్షన్ వెతుక్కుంటాను. ఇంకా చెప్పాలంటే ఎక్కువసేపు ఏడవాలన్నా బోర్.
ఆర్కే : అలాంటి గాసిప్స్ వచ్చినపుడు ఏమనిపిస్తుంది?
అంజలి : నవ్వుకుని ఊరుకుంటాను. నన్ను ఎఫెక్ట్ చేయనంత వరకు పట్టించుకోను.
ఆర్కే : మీరు కనిపించకుండా పోయినపుడు అలాంటి కథనాలు వచ్చాయి. వాటిని విన్నారా?
అంజలి : ఆ విన్నాను. ఫ్రెండ్స్ చెప్పారు. ఇలా నాలుగైదు రకాలుగా అన్నారు. ఇందులో ఏది నిజం అని అడిగారు. ఎవరికి వాళ్లు ఆలోచించుకోని అని వదిలేశాను.
ఆర్కే : ఏ హీరోతో కంఫర్ట్‌గా ఫీలయ్యారు?
అంజలి : అందరు హీరోలతో కంఫర్ట్‌గా ఫీలయ్యాను. అందరితోనూ క్లోజ్‌గా ఉంటాను, ఫ్రెండ్లీగా ఉంటాను, లిమిట్‌లో ఉంటాను.
ఆర్కే : హీరోయిన్లలో స్నేహితులున్నారా?
అంజలి : సమంత, శృతి, హన్సిక... అందరూ మంచి ఫ్రెండ్సే.
ఆర్కే : హైదరాబాద్‌లో సెటిలయిపోయినట్టేనా? ఇల్లు తీసుకున్నారా?
అంజలి : ఆ... తీసుకున్నాను.
ఆర్కే : నెక్ట్స్ ఏంటి? మ్యారేజా?
అంజలి : అప్పుడేనా! ఇప్పుడే కెరీర్ మళ్లీ బిగిన్ అయింది. పెళ్లి ఆలోచన ఇప్పుడైతే లేదు. కొంతకాలం పోనివ్వండి.
ఆర్కే : సినిమా రిటైర్మెంట్ తరువాత ఏదైనా చేయాలనే ఆలోచన ఉందా? ఎప్పుడైనా ఆలోచించావా?
అంజలి : నాకు బిజినెస్ అంటే కొంచెం ఇంట్రస్ట్ ఉంది. తరువాత ఆ వైపు వెళతానేమో! ఫ్యాషన్ డిజైనింగ్ అన్నా కూడా ఇష్టం. అప్పుడు ఆలోచనలను బట్టి వెళతాను.
ఆర్కే : సినిమా ఇండస్ర్టీలో ఒప్పుకున్న రెమ్యునరేషన్ పూర్తిగా ఇవ్వరు అని టాక్ ఉంది. మీ విషయంలో అలా జరిగిందా?
అంజలి : గతంలో జరిగింది నేను చెప్పలేను. నా కంట్రోల్‌లో వచ్చాక మాత్రం ఎవ్వరూ అలా చేయలేదు. పూర్తిగా ఇచ్చారు.
ఆర్కే : పోగొట్టుకున్నదంతా సంపాదించారా?
అంజలి : ఇప్పుడిప్పుడే రికవరీ అవుతున్నాను.
ఆర్కే : ఆ మధ్య లవ్‌లో పడ్డారని విన్నాం, నిజమేనా?
అంజలి : అవన్నీ గాసిప్స్. అలాంటిదేమీ లేదు. హీరోయిన్ బాయ్‌ఫ్రెండ్ ఉంటే ఒకసారి కాకపోయిన మరోసారి మీడియాలో వచ్చేస్తుంది. లైమ్‌లైట్‌లో ఉన్నవారు ఏం చే సినా తెలిసిపోతుంది. ఎంత దాచాలని ప్రయత్నించినా దాగదు.
ఆర్కే : నెక్ట్స్ ప్లాన్ ఏంటి?
అంజలి : మూవీస్, మూవీస్, మూవీస్. నాకు నచ్చిన పాత్రలు వచ్చినంత వరకు చేస్తూనే ఉంటాను.
ఆర్కే : ఇప్పటి వరకు ఎవ్వరితోనూ షేర్ చేసుకోని విషయం ఏమైనా ఉందా?
అంజలి : లేదు. అలాంటిదేమీ లేదు. ఏమున్నా షేర్ చేసుకుంటాను.
ఆర్కే : బాగా సంతోషం కలిగించిన సంఘటన ఏంటి?
అంజలి : కెరీర్ డెవలప్‌మెంట్ బాగా సంతోషాన్నిచ్చింది. ఇప్పుడైతే గీతాంజలి సినిమా చేయడం సంతోషాన్నిచ్చింది.
ఆర్కే : తమిళం మూలంగా తెలుగును చెడగొడుతున్నట్టున్నారు?
అంజలి : అందరూ అదే అంటున్నారు. అక్కడక్కడ, అప్పుడప్పుడు తమిళం వచ్చేస్తోంది.
ఆర్కే : మీ అన్నయ్య నీతోనే ఉంటాడా?
అంజలి : ఊర్లో ఒక బ్రదర్ ఉంటాడు. మ్యారీడ్. అక్కయ్య మ్యారీడ్, తను హైదరాబాద్‌లోనే ఉంటుంది. ఇంకో అన్నయ్య బిజినెస్ చేస్తాడు. ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదు. ఇంకా తనకి పెళ్లి కాలేదు. నాకోసం వెయిట్ చేయకని తన పెళ్లికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాను.
ఆర్కే : లైఫ్ యాంబిషన్ ఏమిటి?
అంజలి : అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి. నా బిహేవియర్ ఇలానే ఉండాలి. పొగరు నెత్తి పైకి రాకూడదు. అంతే...
ఆర్కే : మీరు హ్యాపీగా ఉండాలని, మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ థాంక్యూ వెరీ మచ్.