నా ఫేవరేట్‌ ఇండియా కాదు: చాముండేశ్వరీనాథ్‌

ABN , First Publish Date - 2020-05-08T22:21:51+05:30 IST

ఆర్కే: మీరు రంజీ మ్యాచ్‌లు ఆడినప్పుడు మంచి కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నారు. జాతీయ జట్టులో స్థానం సంపాదించలేకపోయారు. కారణం ఏమిటి?

నా ఫేవరేట్‌ ఇండియా కాదు: చాముండేశ్వరీనాథ్‌

ఆరోపణ చేసిన అమ్మాయిలే విత్‌డ్రా చేసుకున్నారు

నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా...

రాష్ట్రంలో సచిన్‌ ఆస్తులను నేనే చూస్తా

షోయబ్‌ ఇక్కడికే వచ్చేస్తాడు

20-12-2010న జరిగిన ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో చాముండేశ్వరీనాథ్‌


ఆర్కే: మీరు రంజీ మ్యాచ్‌లు ఆడినప్పుడు మంచి కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నారు. జాతీయ జట్టులో స్థానం సంపాదించలేకపోయారు. కారణం ఏమిటి?

చాముండేశ్వరీనాథ్: బోర్డులో, మన అసోసియేషన్‌లో ప్రోత్సహించేవాళ్లు లేక వెళ్లలేకపోయా. ప్రతిభ ఎంత ఉన్నా సెలెక్టర్ల కరుణ తప్పనిసరి.


ఆర్కే: అసోసియేషన్‌ గురించే ఎందుకు కొట్టుకుంటారు?

చాముండేశ్వరీనాథ్: కార్యదర్శి అయిన తర్వాతే తెలిసింది. ఏటా బీసీసీఐ నుంచి 20 నుంచి 25 కోట్లు వస్తుంది. డబ్బు ఇవ్వడం తప్ప బీసీసీఐ పట్టించుకోదు. వాళ్లకి ఓట్లు కావాలి కనక. రంజీ మ్యాచ్‌ ఆటగాళ్లకు 26 శాతం ఇస్తారు. మంగళగిరిలోనూ అంతర్జాతీయ స్టేడియం కట్టేద్దామని, టెండర్లు పిలవకుండానే రూ.40 కోట్లు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కడపలో స్టేడియం నిర్మాణానికి టెండర్లు లేకుండా 4 కోట్లతో ప్రారంభిస్తే అది 9 కోట్లు అయింది.


ఆర్కే: ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ సెక్రటరీగా ఏడాదిన్నర కాలంలోనే మీపై ఆర్థిక అవకతవకలు, ఆడపిల్లలను లైంగికంగా వేధించారని ఆరోపణలు వచ్చాయి.

చాముండేశ్వరీనాథ్: వారిలో ముగ్గురు విత్‌డ్రా అయిపోయారు. హైకోర్టుకు వచ్చి చెప్పారు. అప్పటి విజయవాడ ఎస్పీ గంగరాజు గారి గెస్ట్‌హౌస్‌లో స్టేట్‌మెంట్స్‌ తీసుకున్నారు. భీష్ముడిని చంపడానికి శిఖండిని అడ్డుపెట్టుకున్నట్లు గోకరాజు అమ్మాయిలను అడ్డుపెట్టుకుని నాపై ఆరోపణలు చేయించారు. బైలాస్‌ ట్యాంపర్‌ చేయించానని కేసు పెట్టారు. హైకోర్టు దానిని కొట్టివేసింది. నేను లేనప్పుడు ఆరోపణలు చేయించి సెక్రటరీ పదవి నుంచి సస్పెండ్‌ చేశారు. కోర్టులోనే నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాను.


ఆర్కే: క్రికెట్‌ అంటే మందు, మగువ, మనీ అనే భావన వచ్చేసింది. మిగిలిన ఆటల కంటే క్రేజ్‌ ఎక్కువ ఎందుకని..

చాముండేశ్వరీనాథ్: క్రికెట్‌ ఆటగాళ్లు సినిమాల వైపు ఆకర్షితులు కావడం లేదు. సినీ తారలే క్రికెట్‌ వైపు వస్తున్నారు. ఎంజాయ్‌ చేసే స్థాయికి రావడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది.


ఆయన ఆస్తుల విషయాలన్నీ నేనే చూస్తా

ఆర్కే: మీరు ఇంత వివాదాస్పదమైనా మీకు, సచిన్‌కు మధ్య ఉన్న సాన్నిహిత్యంపై ప్రభావం పడలేదు. ఎందుకని..

చాముండేశ్వరీనాథ్: 1993 నుంచి మేం స్నేహితులం. ఆంధ్రప్రదేశ్‌లో ఆయన ఆస్తుల విషయాలన్నీ నేనే చూస్తా. హైదరాబాద్‌, నెల్లూరుల్లో ఆయనకు భూములున్నాయి. ఎక్కడ ఏ ఆస్తులు కొనాలన్నా నన్ను సంప్రదించే కొంటాడు.


ఆర్కే: అజరుద్దీన్‌కు మీకు పడదా!?

చాముండేశ్వరీనాథ్: అదేమీ లేదు. మొదటి భార్య, పిల్లలు అందరితో స్నేహంగానే ఉంటా. సంగీతా బిజ్‌లానీ వచ్చిన తర్వాతే నేను దూరం అయ్యా. సంగీతతో పెళ్లికి అడ్డుపడ్డాను.


ఆర్కే: సానియాతో అంత పరిచయం ఎలా వచ్చింది?

చాముండేశ్వరీనాథ్: సానియా తండ్రి 1976 నుంచీ తెలుసు. వాళ్ల పెళ్లి వివాదంలోనూ జోక్యం చేసుకుని పరిష్కరించా. షోయబ్‌ కూడా పాకిస్థాన్‌ నుంచి వచ్చేసి ఇక్కడే ఇద్దరూ కలిసి క్రికెట్‌, టెన్నిస్‌ అకాడమీలు ప్రారంభిస్తారు.


ఆర్కే: వచ్చే వరల్డ్‌ కప్‌లో ఇండియా పరిస్థితిపై మీ అంచనా?

చాముండేశ్వరీనాథ్: ఇండియాపై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. నా ఫేవరెట్‌ ఇండియా కాదు.



Updated Date - 2020-05-08T22:21:51+05:30 IST