కశ్యప్, గురుసాయి సహా నలుగురు షట్లర్లకు కరోనా
ABN , First Publish Date - 2020-12-06T10:10:56+05:30 IST
కశ్యప్, గురుసాయి సహా నలుగురు షట్లర్లకు కరోనా
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): భారత స్టార్ షట్లర్లు పారుపల్లి కశ్యప్, హెచ్‌ఎస్ ప్రణయ్‌తో పాటు మరో ఇద్దరు క్రీడాకారులకు కరోనా సోకింది. గతనెల 25న సహచర షట్లర్ గురుసాయిదత్ వివాహం జరిగింది. ఈ వేడుకకు కశ్యప్, సైనా దంపతులతోపాటు ప్రణయ్ సహా పలువురు హాజరయ్యారు. వరుడు గురుసాయితో పాటు కశ్యప్, ప్రణయ్, డబుల్స్ ప్లేయర్ ప్రణవ్ జెర్రీ వైరస్ బారిన పడ్డారు. కాగా.. కశ్యప్ భార్య సైనాకు, గురుసాయి భార్య అమూల్యకు నెగెటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన నలుగు రిలో ఎవరికీ కరోనా లక్షణాలు లేకపోవ డంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ముందుజా గ్రత్తగా గోపీచంద్ అకాడమీలోని సిబ్బందికి కూడా కొవిడ్ టెస్టు చేయనున్నారు.