పామాయిల్ రైతుల కోసం ‘3ఎఫ్ అక్షయ’ మొబైల్ యాప్

ABN , First Publish Date - 2020-05-26T22:55:22+05:30 IST

పామాయిల్ రైతుల కోసం 3ఎఫ్ ఆయిల్ పామ్ ఆగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఓ ప్రత్యేక యాప్‌ను తీసుకొచ్చింది. ‘3ఎఫ్ అక్షయ’ అనే ఈ యాప్...

పామాయిల్ రైతుల కోసం ‘3ఎఫ్ అక్షయ’ మొబైల్ యాప్

హైదరాబాద్: పామాయిల్ రైతుల కోసం 3ఎఫ్ ఆయిల్ పామ్ ఆగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఓ ప్రత్యేక యాప్‌ను తీసుకొచ్చింది. ‘3ఎఫ్ అక్షయ’ అనే ఈ యాప్ ద్వారా పామాయిల్ రైతుల కు లోన్లు ఇవ్వడం, పురుగుమందులు అందించడం వంటి సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. అంతేకాకుండా కంపెనీకి సంబంధించిన అన్ని వివరాలు ఇందులో ఉంటాయని వెల్లడించింది. దేశంలో మొదటి సారిగా ఇలాంటి యాప్‌ను విడుదల చేయడం జరిగిందని, ఇది పామాయిల్ రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని స్పష్టం చేసింది. రైతులు పాయాయిల్ పంటను పండించే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి ఎలా సాధించాలి తదితర అంశాలకు సంబంధించి సమాచారమంతా ఈ యాప్ ద్వారా రైతులకు సంస్థ అందిస్తుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్; కర్నాటక, తెలంగాణలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని వేల మంది రైతులకు ఈ యాప్ ద్వారా అనేక సేవలు అందించనున్నామని సంస్థ వెల్లడించింది.


యాప్ ఫస్ట్ ఫేజ్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని 20 వేల మంది రైతులకు పలు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పింది. మిగతా రాష్ట్రాల్లో మరికొన్ని రోజుల్లో సేవలను ప్రారంభిస్తామని వెల్లడించింది. ఈ యాప్‌ ద్వారా రైతులకు ప్రత్యేకంగా ఆన్‌లైన్ శిక్షణ ఇస్తామని, ప్రతి రైతుకు ఓ యూజర్ ఐడీ ఉంటుందని, దాని ద్వారా కంపెనీ నుంచి పురుగులు మందుల కొనుగోలు చేయడం, అవసరమైన లోన్లకు దరఖాస్తు చేసుకోవడం వంటి సేవలు వారు పొందవచ్చని వివరించింది. అంతేకాకుండా పంటకు ఎంత ఖర్చు పెట్టారు, రోజువారి ఖర్చుల జాబితా వంటి సదుపాయాలు ఈ యాప్‌లో పొందుపరిచినట్లు వెల్లడించారు.

Updated Date - 2020-05-26T22:55:22+05:30 IST