ఈ నెమలి నాట్యం దేనికి సంకేతం!

ABN , First Publish Date - 2020-04-23T00:48:38+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌తో జన సంచారం, వాతావరణం కాలుష్యం, వాహనాల శబ్ధాలు తగ్గాయి. దీంతో పశుపక్షాదులు, వన్య ప్రాణులు స్వేచ్ఛగా ..

ఈ నెమలి నాట్యం దేనికి సంకేతం!

కుమ్రంభీంఆసిఫాబాద్: కరోనా లాక్‌డౌన్‌తో జన సంచారం, వాతావరణం కాలుష్యం, వాహనాల శబ్ధాలు తగ్గాయి. దీంతో పశుపక్షాదులు, వన్య ప్రాణులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. కాగజ్‌నగర్ పట్టణంలోని ఓ కాలనీలో మయూరి కనువిందు చేసింది. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ నెమలి పురి విప్పి నాట్యం చేసింది. అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం జనాలు ఇళ్లకు పరిమితం అవడం, వాహనాల రాకపోకలు లేక రోడ్లు నిర్మానుష్యం కావడంతో సమీప అటవీ ప్రాంతం నుంచి జంతువులు, పక్షులు ఆకలి, దప్పికను తీర్చుకోవడానికి జనావాసాల్లోకి వస్తున్నాయి. ఈ నెమలి మాత్రం నాట్యం చేసి ఎంతో ఆనందాన్ని కలిగించి అందరినీ అలరించింది. 

Updated Date - 2020-04-23T00:48:38+05:30 IST