నోముల నర్సింహ్మాయ్య మృతిని రాజకీయం చేయకండి:రఘువీర్ రెడ్డి

ABN , First Publish Date - 2020-12-05T20:14:09+05:30 IST

నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల నర్సింహ్మాయ్య మృతిని రాజకీయం చేయకూడదని సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి విజ్ఘప్తి చేశారు.

నోముల నర్సింహ్మాయ్య మృతిని రాజకీయం చేయకండి:రఘువీర్ రెడ్డి

హైదరాబాద్: నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల నర్సింహ్మాయ్య మృతిని రాజకీయం చేయకూడదని సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి విజ్ఘప్తి చేశారు. నాగార్జున సాగర్  నియోజకవర్గ ప్రజలకు నేను సుపరిచితుడను. మాజీ సీఎల్పీ నేత పెద్దలు కుందూరు జానారెడ్డి తనయుడిగా నియోజకవర్గంలో  అందరి ఆదరాభిమానాలు పొందుతున్న వాడిని. మా నాన్న బాటలో నైతిక విలువలతో కూడిన రాజకీయ ఓనమాలు నేర్చుకున్నవాడిని.


సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించిన రోజు నుంచే ఉప ఎన్నికలపై వివిధ రాజకీయ పార్టీలు గెలుపు పై రకరకాలుగా విషప్రచారానికి తెర తీస్తున్నారు. ఇది చాలా భాదాకరమని ాయన తెలిపారు. రాజకీయాల్లో విలువలు శిలువలవుతున్న నేటి రోజుల్లో నైతికత..నమ్మకం..విలువలు కల్గిన కుటుంబం నుంచి వచ్చిన వాడిగా దివంగత ఎమ్మెల్యే నోముల సంతాప దినాలు అయ్యే వరకైనా రాజకీయాలు పక్కన పెడుదామని అనారు. రాజకీయ చర్చలకు ఎవరు తావివోద్దు, సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేయవద్దని మనవి చేశారు.  తాను పార్టీ మారుతున్నానని కొన్ని రాజకీయ పార్టీలు దిగజారుడు రాజకీయ విష ప్రచారం చేయిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.


దయ చేసి మరికొద్ది రోజులు రాజకీయాలు పక్కన పెడుదాం. నోముల నర్సింహ్మయ్యగారి  సంతాప దినాలు కూడా పూర్తవకుండానే రాజకీయాలు చేయడం భాధాకరం తెలిపారు. జానా రెడ్డి ఆశయ లక్ష్య సాధనలో నేను ముందుకు సాగుతున్నానని తెలిపారు. నేను చెప్పేదొకటే నాగార్జున సాగర్ నియోజకవర్గం ప్రజల మనిషిగా నేను  కొనసాగుతాను. సోషల్ మీడియాలో , మీడియాలో నేను పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. 

Updated Date - 2020-12-05T20:14:09+05:30 IST