ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం
ABN , First Publish Date - 2020-12-08T04:54:35+05:30 IST
ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం
- ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
ఇబ్రహీంపట్నం రూరల్/యాచారం : ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరంలా మారిందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధి ఉప్పరిగూడ గ్రామానికి చెందిన నర్సింహ్మకు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా మంజూరైన రూ.24 వేల చెక్కును ఎమ్మెల్యే బాధిత కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో ఉప్పరిగూడ ఉపసర్పంచ్ నర్సింహారెడ్డి, నల్లోల రమేష్, శ్రీశైలం, వెంకటేష్, గోపాల్, శ్రీరాంయాదవ్ పాల్గొన్నారు. యాచారం మండల పరిధి చౌదర్‌పల్లి గ్రామానికి చెందిన బొడ్డు ఐలయ్యకు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా మంజూరైన రూ.15వేల చెక్కును సర్పంచ్ నర్సింహారెడ్డి బాధిత కుటుంబానికి అందజేశారు.
ఆరోగ్యతెలంగాణ నిర్మాణమే లక్ష్యం
ఆమనగల్లు : ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన ఆర్.శారదకు రూ.45 వేలు, కడ్తాల మండలం చరికొండకు చెందిన ఎన్.జగన్‌కు రూ.27 వేలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరయ్యాయి. సోమవారం ఆమనగల్లులో ఎంపీపీలు కమ్లీమోత్యనాయక్, అనితవిజయ్‌లతో కలిసి బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు వస్పుల జంగయ్య, గూడూరు భాస్కర్‌రెడ్డి, అవ్వారి శివలింగం, తల్లోజు రామకృష్ణ, గాజుల శ్రీనివాస్, వగ్గు మహేశ్ పాల్గొన్నారు. తలకొండపల్లి మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన శ్రీశైలంకు రూ.24వేలు, కొర్రతండాకు చెందిన జైపాల్‌కు రూ.10,500లు, మాడ్గుల మండలం అప్పారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పి.రోశయ్యకు రూ.26వేలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరయ్యాయి. ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ నగరంలోని తన నివాసంలో సోమవారం ఆయా మండలాల నాయకులతో కలిసి బాధిత కుటుంబాలకు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్‌నాయక్, సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేశ్, టీఆర్‌ఎ్‌స్ మండల అధ్యక్షుడు నాలాపురం శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మాడ్గుల మండల అధ్యక్షుడు లాలయ్యగౌడ్, ఎంపీటీసీ జైపాల్‌రెడ్డి, పగడాల రవి, నాయకులు పవన్‌రెడ్డి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా మాడ్గుల మండలం అప్పారెడ్డిపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు నిర్వహించారు.