మహిమాన్విత క్షేత్రం కీసర గుట్ట
ABN , First Publish Date - 2020-02-17T09:58:30+05:30 IST
లింగ స్వరూపుడైన మహాశివుడు రాముని కోరి క మేరకు శ్రీరామలింగేశ్వరస్వామిగా ఉద్భవించిన అపురూప శైవక్షేత్రమే కీసరగుట్ట. ఈ క్షేత్రంపై అనేక పురాణ గాథలు ఉన్నాయి. ఆ
శ్రీరాముడి చేత లింగాకారంలో పరమశివుడి ప్రతిష్ఠాపన
క్షేత్ర పాలకుడిగా హనుమంతుడు
అక్కన్న, మాదన్నలు నిర్మించిన ఆలయం
పురాతత్వ పరిశోధనల్లోనూ
ఏళ్ల చరిత్ర కలిగి.. భక్తుల కొంగు బంగారంగా భాసిల్లుతోంది మేడ్చల్ జిల్లాలోని కీసరగుట్ట క్షేత్రం. శివర్రాతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 19వ తేదీ నుంచి 24 వరకు కీసరగుట్టలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచీ భక్తులు తరలిరానున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాశస్త్యం,
చరిత్రపై ప్రత్యేక కథనం.
వెలుగుచూసిన చారిత్రక ఆధారాలు
కీసర : లింగ స్వరూపుడైన మహాశివుడు రాముని కోరి క మేరకు శ్రీరామలింగేశ్వరస్వామిగా ఉద్భవించిన అపురూప శైవక్షేత్రమే కీసరగుట్ట. ఈ క్షేత్రంపై అనేక పురాణ గాథలు ఉన్నాయి. ఆలయ ఆవరణలోని విజయ స్థూపం పై మత్స, కూర్మ, వరాహ, గణపతి, కేసరి, ఆంజనేయ వి గ్రహాల ఆధారంగా క్షేత్రం శైవ, వైష్ణవ సంప్రాదాయాల క లయికగా ఉంది. సాక్షాత్తు శ్రీరామచంద్రుడి చేతుల మీ దుగా మలిచిన ఆ పరమ శివుడు ఈ క్షేత్రంలో రామలింగేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. హైదరాబాద్ నగరానికి 30కిలో మీటర్ల దూరంలోని ఈ ఆలయం పురాతనమైనదిగా చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. ప్రకృ తి రమణీయతతో కొండల మధ్య విశాల ప్రాంతాలతో ఆధ్యాత్మిక చింతనకు ప్రతీకగా ఉన్న ఈ క్షేత్రం భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. రాష్ట్రంలోనే ప్రముఖ శైవక్షేత్రం కీసరగుట్ట అనడంలో అతిశయోక్తి లేదు.
పురాణాలకు చరిత్రగా... ఆధ్యాత్మికతకు నిలయంగా.. సాంస్కృతికతకు కేంద్రంగా పేరుగాంచిన కీసరగుట్ట క్షేత్రం బ్రహోత్సవాలకు ముస్తాబవుతోంది. శ్రీ భవానీ శివదుర్గ సమేత శ్రీరామలింగేశ్వ స్వామి ఆలయంలో యేటా మాఘ బహుళ త్రయోదశి మొదలు శుద్ధ విదియ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆరు రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు. కనుల పండువగా జరిగే ఈ ఆధ్యాత్మిక ఉత్సవాలకు తెలంగాణ నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల భక్తులు లక్షల్లో తరలివస్తారు.
క్షేత్ర పురాణం
బ్రాహ్మణుడైన రావణుడిని సంహరించిన అనంతరం సీతా సమేతంగా శ్రీరాముడు అయోధ్య నగరానికి బయల్దేరాడు. బ్రాహ్మణ హత్యా పాపాన్ని పోగుట్టుకునేందుకు రుషుల సూచనల మేరకు శ్రీరాముడు పలు ప్రాంతాల్లో శివలింగ ప్రతిష్ఠాపనలు చేయ సం కల్పిస్తాడు. శ్రీరాము డు ఈ ప్రాంతం గుండా వెళ్తూ.. ఇక్కడి ప్రకృతి రమణీయతకు ముగ్దుడై ఇ క్కడే శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి పూనుకుని ముహూర్తంపై మహర్షులను కోరాడు. శివలింగాన్ని కాశి నుంచి తే వాల్సిందిగా శ్రీరాముడు హనుమంతుడిని ఆజ్ఞాపించాడు. అక్కడికి వెళ్లిన హనుమంతుడికి ఈశ్వరుడు నూటొక్క శివలింగాల రూపంలో దర్శనమిచ్చాడు.
హనుమంతుడు వాటిల్లో దేన్నీ ఎంచుకోలేక పరమేశ్వరుడిని ప్రార్థించి నూ టొక్క లింగాలతో ఆకాశ మార్గాన కీసరగుట్టకు బయల్దేరా డు. మహర్షులు నిర్ణయించిన ముహుర్తానికి హనుమంతు డు రాకపోవడంతో సీతారామచంద్రులు పరమశివుడిని ప్రార్థించారు. వారికి పరమేశ్వరుడు శివలింగరూపంలో ద ర్శనమివ్వగా సీతారామంచంద్రులు ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించి అభిషేకించారు. అందువల్లనే శ్రీరామలింగేశ్వస్వా మి ఆలయంగా పేరు వచ్చింది. ఇంతలో హనుమంతుడు నూటొక్క శివలింగాలతో వచ్చాడు. ‘స్వామీ.. వీటిలో మీకు కావాల్సిన శివలింగాన్ని ప్రతిష్ఠించండి. మిగతా వాటిని కా శీలో యథా స్థానంలో ఉంచి వస్తా.’ అని రాముడితో అనగా.. ‘హనుమా.. నీ రాక ఆలస్యమవడంతో పరమేశ్వరున్ని ప్రార్థించాను. స్వామి లింగరూపుడుగా ప్రత్యక్షం కాగా ప్రతిష్ఠించాను.’ అని శ్రీరాముడు హనుమంతునికి చెప్పాడు. తాను తెచ్చిన శివలింగాల్లో ఏ ఒక్కటీ నా స్వా మికి ఉపయోగపడలేదనే కోపంతో హనుమంతుడు నూటొక్క శివలింగాలను తన తోకతో చుట్టి విసిరేశాడు. అవి ఈ పరిసరాల్లో చెల్లాచెదురుగా పడ్డాయి. అప్పుడు రా ముడు హనుమంతుడిని శాంతిపజేసి ‘ఈ క్షేత్రం ఇప్పటి నుంచి ఆ చంద్రతారార్కం నీ పేరుతో కేసరిగిరిగా ప్రసిద్ధి చెందుతుంది.’ అని వరమిచ్చాడు. క్షేత్రపాలకుడుగా మారి న హనుమంతుడు తాను విసిరిన శివలింగాల్లో ఒకదాన్ని స్వామి వారి వామ భాగంలో ప్రతిష్ఠించాడు. దాన్నే ఇప్పు డు మారుతీ కాశీవిశ్వేశ్వర ఆలయం అంటున్నారు.
మహిమగల రామలింగేశ్వరుడు
కీసరగుట్టలోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం పశ్చి మ అభిముఖంగా ఉండటం ఇక్కడ విశేషం.
గర్భాలయంలోని మూల విరాట్టుకు నిత్యం భక్తులు పాలు, పెరుగు, పంచామృతాలు, శుద్ధ జలంతో చేసే అభిషేక పదార్థాలు స్వామివారి కుడి భాగం వైపునకు వెళ్తాయి. ఈ పదార్థాలన్నీ ఎక్కడికి వెళ్తాయో ఇప్పటికీ ఎవ్వరికి తెలియ దు. దాన్ని నిర్ధారించేందుకు గతంలో కొందరు సాకేంతికం గా చేసిన ప్రయత్నాలూ ఫలించలేదు.
ఆలయ చరిత్ర
పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ జరిపిన తవ్వకాల్లో లభించిన ఆనవాళ్లు, చారిత్రక పరిశోధకుల అభిప్రాయం మేరకు క్రీస్తు శకం 4వ శతాబ్దంలో ఉత్తారార్థం నుంచి 7వ శతాబ్దం వరకు ఆంధ్ర దేశాన్ని ఏక చత్రాధిపత్యంగా పాలి ంచిన విష్ణుకుండుడి రాజవంశస్థులకు కీసరగుట్టతో సన్నిహిత సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతాన్ని వా రు రాజధానిగా, సైనిక స్థావరంగా ఏర్పాటు చేసుకున్నా రు. వీరి రాజముద్రికగా లఘించు సింహం(కేసరి) ఏర్పా టు చేసుకున్నారు. ఈ ప్రాంతంలో విష్ణుకుండుడి రాజవంశానికి చెందిన రెండో మాధవవర్మ 11 అశ్వమేథ యాగా లు, వెయ్యికిపైగా ఇతర యాగాలు నిర్వహించారు. నర్మద తీరం వరకు తన రాజ్య విస్తరణ చేసినట్టు తెలుస్తోంది. పురావస్తు శాఖ తవ్వకాల్లో 3చదరపు కిలో మీటర్ల పరిధి లో ఉన్న శిథిల కోట, భవనాలు, ఆభరణాలు, అలంకార వస్తువులు, నాణాలు, మట్టి పాత్రలు, యజ్ఞ గుండాలు వెలుగుచూశాయి. ఇటీవల ఈ ప్రాంతంలోని ప్రాచీన కట్టడాల చుట్టూ పాత్‌వే పనులు చేపడుతున్నారు. క్రీ.శ 4, 5 శతాబ్దాలకు సంబంధించిన పదుల సంఖ్యలో జైన తీర్థంకరుల విగ్రహాలు కూడా వెలుగుచూశాయి.
అక్కన్న, మాదన్నల హయాంలో ఆలయ నిర్మాణం
క్రీ.శ 17వ శతాబ్దంలో గోల్కొండ కుతుబ్‌షాహీ తానీ షా వద్ద అక్కన్న, మాదన్న మహామంత్రులుగా పనిచేశా రు. వారు ఈ క్షేత్రాన్ని దర్శించి దీన్ని హరిహర క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు సంకల్పించారు. హిందూ మహ్మదీయ స మ్మిళిత సంప్రదాయం ఉట్టిపడేలా ఆలయాన్ని నిర్మింపజేసి లక్ష్మీనరసింహాస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రస్తు తం సీతారామచంద్రాస్వామి, శివపంచాయతన స్వామివా ర్ల విగ్రహాలను సైతం ప్రతిష్ఠించారు. ఆలయ దేవతామూర్తులను మహాశివరాత్రి ఉత్సవాల్లోనే కాకుండా సాధారణ సమయాల్లోనూ భారీసంఖ్యలో దర్శించుకుంటారు.
సీతమ్మ గుహ...
శ్రీరాముడు రావణుని వధించిన తరువాత ఈ ప్రాం తంలో ఉన్న సమయంలో సీతమ్మ వారు ప్రశాంతత కో సం తపస్సు ఆచరించిన స్థలమే సీతమ్మగుహ. ఈ గుహ శ్రీరామలింగేశ్వరుని ఆలయం కుడి దిగువ భాగంలో ఉం ది. సీతమ్మ వారు తపస్సు చేసిన ఈ గుహలో ప్రస్తుతం మహిషాసుర మర్దిని ఆలయంగా మారింది.
అతిరథ మహాయాగం నిర్వహించిన పుణ్యక్షేత్రం
దేశంలోని సప్త సోమయాగాల్లో ఒకటి కీసరగుట్ట లో అతిరథమహాయాగాన్ని నిర్వహించారు. తపస్ సంస్థ ఆధ్వర్యంలో కేరళకు చెందిన నంబూ ద్రీ వంశీకులు ఈ యాగాన్ని 2013 ఏప్రిల్‌లో 10 రోజుల
పాటు నిర్వహించారు. ఇలాంటి యాగాన్ని భద్రాచలం, కీసరగుట్టల్లో మాత్రమే నిర్వహించారు.
హుడా పార్క్
ప్రకృతి అందాల నడుమ ఆహ్లాదకర వాతావరణంలో ప్రభుత్వం ఏర్పాటు హుడా పార్క్‌ను ఏర్పాటు చేసింది. ఆలయ దిగువన ఈ పార్క్ లో ప్రతి చెట్టు శివలింగ రూపంలో దర్శనం