పనియారం (పొంగణాలు)

ABN , First Publish Date - 2020-01-11T17:47:02+05:30 IST

:ఇడ్లీ పిండి - రెండు కప్పులు, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - రెండు, అల్లం ముక్క - కొద్దిగా, ఇంగువ - చిటికెడు, మిరియాలపొడి - పావు టీస్పూన్‌, కారం - పావు టీస్పూన్‌, కరివేపాకు - కొద్దిగా, కొబ్బరి తురుము - అర కప్పు, ఉప్పు - తగినంత.

పనియారం (పొంగణాలు)

కావలసినవి:ఇడ్లీ పిండి - రెండు కప్పులు, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - రెండు, అల్లం ముక్క - కొద్దిగా, ఇంగువ - చిటికెడు, మిరియాలపొడి - పావు టీస్పూన్‌, కారం - పావు టీస్పూన్‌, కరివేపాకు - కొద్దిగా, కొబ్బరి తురుము - అర కప్పు, ఉప్పు - తగినంత.
 
తయారీ విధానం:ఒక పాత్రలో ఇడ్లీ పిండి తీసుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొబ్బరి తురుము, దంచిన అల్లం ముక్క, ఇంగువ, మిరియాల పొడి, కారం, కరివేపాకు, కొద్దిగా ఉప్పు వేసి కలియబెట్టాలి.పొంగణాల పాత్రను స్టవ్‌పై పెట్టి కొద్దిగా నూనె వేయాలి. స్పూన్‌తో పిండిని పొంగణాల గుంతల్లో వేయాలి.చిన్నమంటపై రెండు మూడు నిమిషాలు ఉడికించి స్పూన్‌ సహాయంతో పొంగణాలను తిప్పి మరికాసేపు ఉడికించి దింపుకోవాలి.కొబ్బరి చట్నీ లేదా సాంబరుతో తింటే రుచిగా ఉంటాయి.

Updated Date - 2020-01-11T17:47:02+05:30 IST