బాసుంది

ABN , First Publish Date - 2020-06-02T16:42:08+05:30 IST

చిక్కటి పాలు - ఒక లీటరు, బాదం, జీడి, పిస్తా పప్పులు- 10 చొప్పున, కుంకుమపువ్వు

బాసుంది

కావలసిన పదార్థాలు: చిక్కటి పాలు - ఒక లీటరు, బాదం, జీడి, పిస్తా పప్పులు- 10 చొప్పున, కుంకుమపువ్వు - 4 కాడలు, యాలకుల పొడి - అర టీ స్పూను, పంచదార - 75 గ్రా.

 

తయారుచేసే విధానం: ముందుగా బాదం, పిస్తా, జీడిపప్పులను సన్నగా పొడుగ్గా తరిగి పక్కనుంచుకోవాలి. ఒక వెడల్పాటి లోతైన పాత్రలో పాలు పోసి సన్నటి సెగమీద అడుగంటకుండా మరిగించాలి. పాలు పావు వంతు తగ్గాక కుంకుమపువ్వు, యాలకులు పొడి కలపాలి. పాలు 50 వంతు తగ్గాక పంచదార కలిపి రెండు నిమిషాల తర్వాత దించేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ బాసుందిని ఫ్రిజ్‌లో 4 గంటలు ఉంచి తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.

Updated Date - 2020-06-02T16:42:08+05:30 IST