బనానా హల్వా

ABN , First Publish Date - 2020-02-15T17:09:47+05:30 IST

అరటికాయలు - మూడు, పంచదార - 150గ్రాములు, నెయ్యి - ఐదు టేబుల్‌స్పూన్లు, పాలు - ఒకటిన్నరకప్పు, జీడిపప్పు - పది పలుకులు, బాదం - పది పలుకులు, యాలకుల పొడి - అర టీస్పూన్‌.

బనానా హల్వా

కావలసినవి : అరటికాయలు - మూడు, పంచదార - 150గ్రాములు, నెయ్యి - ఐదు టేబుల్‌స్పూన్లు, పాలు - ఒకటిన్నరకప్పు, జీడిపప్పు - పది పలుకులు, బాదం - పది పలుకులు, యాలకుల పొడి - అర టీస్పూన్‌.


తయారీ : ముందుగా అరటికాయలను కుక్కర్‌లో ఉడికించాలి. తరువాత పొట్టు తీసి గుజ్జుగా చేయాలి.

జీడిపప్పు, బాదం పలుకులను ముక్కలుగా చేసుకోవాలి.

ఒక పాత్రలో నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక అరటికాయ గుజ్జు వేసి వేగించాలి. 

తరువాత పాలు, పంచదార వేసి కలియబెట్టాలి. చిన్నమంటపై ఉడికించాలి.

బాదంపలుకులు, జీడిపప్పు ముక్కలు వేయాలి. 

మిశ్రమం చిక్కగా అయ్యాక యాలకుల పొడి చల్లితే నోరూరించే బనానా హల్వా రెడీ

Updated Date - 2020-02-15T17:09:47+05:30 IST