శనగపిండి బర్ఫీ
ABN , First Publish Date - 2020-12-18T19:32:33+05:30 IST
శనగపిండి - 2 కప్పులు, నెయ్యి - ఒక కప్పు, (తీపి లేని) మిల్క్‌పౌడర్ - ఒక కప్పు, దాల్చినచెక్క పొడి - పావు టీ స్పూను, పంచదార - ఒకటిన్నర కప్పు, నీరు - ఒక కప్పు, డ్రై ఫ్రూట్స్ తరుగు - పావు కప్పు.
కావలసిన పదార్థాలు: శనగపిండి - 2 కప్పులు, నెయ్యి - ఒక కప్పు, (తీపి లేని) మిల్క్‌పౌడర్ - ఒక కప్పు, దాల్చినచెక్క పొడి - పావు టీ స్పూను, పంచదార - ఒకటిన్నర కప్పు, నీరు - ఒక కప్పు, డ్రై ఫ్రూట్స్ తరుగు - పావు కప్పు.
తయారుచేసే విధానం: కడాయిలో నెయ్యి వేడి చేసి శనగపిండి కొద్దికొద్దిగా కలపాలి. తర్వాత దాల్చినచెక్క పొడి, మిల్క్‌పౌడర్ కలిపి పచ్చివాసన పోయాక పక్కనుంచాలి. ఇప్పుడు కడాయిలో పంచదార, నీరు కలిపి తీగపాకం రాగానే శనగపిండి మిశ్రమం వేసి ఉండలు లేకుండా తిప్పుతూ చిక్కబడ్డాక నెయ్యి రాసిన ప్లేట్‌లో వేసి సరిచేసి పైన డ్రైఫ్రూట్స్ చల్లాలి. 30 నిమిషాల తర్వాత చాకుతో మీకు కావలసిన షేపులో ముక్కలుగా కట్ చేసుకోవాలి.