బ్లూబెర్రీ లెమనేడ్‌

ABN , First Publish Date - 2020-05-14T14:55:59+05:30 IST

లాక్‌డౌన్‌ సమయంలో కొత్తవంటకాలు ప్రయత్నించడం, కొత్త రుచుల్ని ఆస్వాదించడం ద్వారా బోర్‌కొట్టకుండా గడిపేస్తున్నారు చాలామంది. అయితే ఇంట్లో ఉన్నప్పటికీ ఎండ తీవ్రత తప్పడం లేదు. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు సాయంత్రం వేళ చల్లగా గ్లాసుడు బ్లూబెర్రీ లెమనేడ్‌ ట్రై చేయండి.

బ్లూబెర్రీ లెమనేడ్‌

ఆంధ్రజ్యోతి(14-05-2020):

లాక్‌డౌన్‌ సమయంలో కొత్తవంటకాలు ప్రయత్నించడం, కొత్త రుచుల్ని ఆస్వాదించడం ద్వారా బోర్‌కొట్టకుండా గడిపేస్తున్నారు చాలామంది. అయితే ఇంట్లో ఉన్నప్పటికీ ఎండ తీవ్రత తప్పడం లేదు. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు సాయంత్రం వేళ చల్లగా గ్లాసుడు బ్లూబెర్రీ లెమనేడ్‌ ట్రై చేయండి.

కావలసినవి: చక్కెర- అరకప్పు, నీళ్లు- అరకప్పు, ఒకటి లేదా అరకప్పు బ్లూబెర్రీలు, నిమ్మకాయలు-రెండు, చల్లని నీళ్లు-  ఒక కప్పు, సోడా- అరలీటరు, ఐస్‌క్యూబ్స్‌. 

తయారీ: ఒక సాస్‌పాన్‌ తీసుకొని అందులో బ్లూబెర్రీ, చక్కెర, నీళ్లు పోయాలి. మధ్యస్థమైన మంట మీద కాసేపు మరగనివ్వాలి. 

చక్కెర పూర్తిగా నీళ్లలో కరిగేంత వరకూ కలపాలి. బ్లూబెర్రీలు చిక్కని పేస్టులా అయ్యాక స్టవ్‌ ఆర్పేసి చల్లారనివ్వాలి. 

బ్లూబెర్రీలను గుజ్జులా చేసుకొని నిమ్మరసం పిండి బాగా కలపాలి. తరువాత గ్లాసులో మూడొంతులు బ్లూబెర్రీ లెమనేడ్‌, ఒక వంతు సోడా పోసి, ఐస్‌ముక్కలు, పుదీనా వేసి సర్వ్‌ చేయాలి.

Updated Date - 2020-05-14T14:55:59+05:30 IST