చిక్కీలు
ABN , First Publish Date - 2020-11-14T16:29:53+05:30 IST
ఎండు కొబ్బరి తురుము - రెండు కప్పులు, బెల్లం - పావు కప్పు, పంచదార - ఒకకప్పు, యాలకుల పొడి - ఒక టీస్పూన్
కావలసినవి: ఎండు కొబ్బరి తురుము - రెండు కప్పులు, బెల్లం - పావు కప్పు, పంచదార - ఒకకప్పు, యాలకుల పొడి - ఒక టీస్పూన్.
తయారీ విధానం: స్టవ్‌పై పాన్ పెట్టి బెల్లం కరిగే వరకు వేడి చేయాలి. మరొక పాన్‌లో కొబ్బరి తురుము వేసి గోధుమరంగులోకి మారే వరకు వేగించి ఒక పాత్రలోకి తీసుకోవాలి. కరిగిన బెల్లంలో పంచదార వేసి కలపాలి. పంచదార కరిగిన తరువాత వేగించిన కొబ్బరి తురుము వేసి కలియబెట్టుకోవాలి. తరువాత యాలకుల పొడి వేసి మరికాసేపు వేగించాలి. ఈ మిశ్రమాన్ని కావాల్సిన ఆకారంలో ఉన్న కప్పుల్లో పోసి ఫ్రిజ్‌లో గంట పాటు పెట్టాలి. తరువాత కప్పుల్లోంచి తీసి సర్వ్ చేసుకోవాలి.