సూపర్ సిట్రస్ జ్యూస్
ABN , First Publish Date - 2020-03-07T17:37:32+05:30 IST
ఆరెంజ్ - ఒకటి, నిమ్మకాయ - ఒకటి, అల్లం - చిన్న ముక్క, కీరదోస - ఒకటి, పుదీనా - కట్ట.
కావలసినవి: ఆరెంజ్ - ఒకటి, నిమ్మకాయ - ఒకటి, అల్లం - చిన్న ముక్క, కీరదోస - ఒకటి, పుదీనా - కట్ట.
తయారీ:
* నారింజ పండు తొక్కతీసి పెట్టుకోవాలి.
* అల్లం, కీరదోసను ముక్కలుగా కట్ చేసుకోవాలి.
* పుదీనాను శుభ్రంగా కడిగి తరగాలి.
* వీటన్నింటిని మిక్సీలో వేసి జ్యూస్ చేసుకోవాలి.
* నిమ్మరసం పిండుకుని సర్వ్ చేసుకోవాలి.