మావా కోకొనట్‌ రోల్‌

ABN , First Publish Date - 2020-10-24T22:05:26+05:30 IST

కోవా - ఒకకేజీ, పంచదార - 300గ్రా, కుంకుమపువ్వు - ఒక గ్రాము, కొబ్బరి పొడి - 100గ్రాములు.

మావా కోకొనట్‌ రోల్‌

కావలసినవి: కోవా - ఒకకేజీ, పంచదార - 300గ్రా, కుంకుమపువ్వు - ఒక గ్రాము, కొబ్బరి పొడి - 100గ్రాములు.


తయారీ విధానం: స్టవ్‌పై పాన్‌ పెట్టి కోవా, పంచదార వేసి వేడి చేయాలి. పంచదార పూర్తిగా కరిగేంత వరకు ఉంచాలి. మిశ్రమం చిక్కబడిన తరువాత స్టవ్‌పై నుంచి దింపి చల్లారబెట్టుకోవాలి.


తరువాత రెండు భాగాలుగా కట్‌ చేసుకోవాలి. ఒక భాగం తీసుకుని కర్రతో చపాతీలా వెడల్పులా చేసుకోవాలి. మరో భాగంలో కుంకుమ పువ్వు కలిపి, చపాతీలా వెడల్పుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక భాగంపై మరొక భాగం పెట్టి రోల్‌ చేయాలి. కొబ్బరి పొడి అద్ది, గుండ్రంగా చిన్న చిన్న భాగాలుగా కట్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.


Updated Date - 2020-10-24T22:05:26+05:30 IST